kannan
-
సాయిపల్లవి సిస్టర్ పూజకన్నన్ పెళ్లి వేడుక.. ఈ అరుదైన పిక్స్ చూశారా? (ఫొటోలు)
-
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
Sai Pallavi: పూజా కన్నన్ సంగీత్.. చెల్లితో కలిసి చిందేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
పూజా కన్నన్ హల్దీ ఫంక్షన్.. అందరి కళ్లు సాయిపల్లవిపైనే! (ఫోటోలు)
-
మే ఆఖరుకి సాధారణ స్థితికి కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పైలట్ల ఆందోళనలతో ఫ్లయిట్ సర్విసులకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మే నెలాఖరుకల్లా అంతా సద్దుమణుగుతుందని, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొస్తాయని విమానయాన సంస్థ విస్తార సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. పైలట్లు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టామని, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నామని ఆయన వివరించారు. ఫ్లయిట్ల సంఖ్య తగ్గవచ్చు గానీ ఈ వారాంతం నుంచి ఫ్లయిట్లను అప్పటికప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉండబోదని కణ్ణన్ పేర్కొన్నారు. కార్యకలాపాలను కుదించుకునే క్రమంలో 20–25 రోజువారీ ఫ్లయిట్స్‌ను తగ్గించినట్లు ఆయన వివరించారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులకు తమ సిబ్బంది తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు కణ్ణన్ తెలిపారు. విస్తారాలో 6,500 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 1,000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. -
ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్ కన్నుమూత
ప్రముఖ ఛాయాగ్రాహకుడు భీమ్‌సింగ్ కణ్ణన్ శనివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కణ్ణన్ ప్రముఖ తమిళ నిర్మాత, రచయిత, దర్శకుడు భీమ్‌సింగ్ కుమారుడు. బి. కణ్ణన్‌గా అందరికీ తెలిసిన ఈయన ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజాతో ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఒక్క భారతీరాజాతోనే దాదాపు 40 సినిమాలు చేశారు కణ్ణన్. అందుకే తమిళనాడులో ‘భారతీరాజా విన్కన్గళ్’ (భారతీరాజా కళ్లు) గా ఆయన ప్రసిద్ధి. భారతీరాజాతో ఆయన చేసిన చివరి చిత్రం ‘బొమ్మలాట్టమ్’ (2008). తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు కెమెరామేన్‌గా పనిచేశారు కణ్ణన్. తెలుగులో ఆయన కెమెరామేన్‌గా పని చేసిన చిత్రాల్లో ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. కణ్ణన్‌కు భార్య కాంచన, కుమార్తెలు మధుమతి, జనని ఉన్నారు. ఫిల్మ్ మేకర్ బి. లెనిన్‌కి సోదరుడు కణ్ణన్. బి. కణ్ణన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కణ్ణన్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరుగుతాయి. -
షావుకారు జానకి @ 400
నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాల వరకూ చేసిన తారల్లో అలనాటి తార షావుకారు జానకి ఒకరు. కథానాయికగా ఒకప్పుడు వెండితెరను ఏలిన జానకి ఇప్పుడు బామ్మ పాత్రలు చేస్తున్నారు. ఆమె సినీ మైలురాయి 400వ చిత్రానికి చేరుకుంది. తమిళ హాస్యనటుడు సంతానం హీరోగా కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బామ్మ కస్తూరి పాత్రలో నటిస్తున్నారు జానకి. ఇది ఆమెకు 400వ చిత్రం కావడం విశేషం. ‘‘జానకిగారి ల్యాండ్ మార్క్ మూవీ మా చిత్రం కావడం సంతోషంగా ఉంది. ఆమె ఎంతటి ప్రతిభాశాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా చిత్రకథ, పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వర్థమాన సినీ దర్శకుడు మృతి
చెన్నై: కోలీవుడ్ వర్థమాన సినీ దర్శకుడు కన్నన్ రంగస్వామి (27) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తమిళంలో గత మార్చిలో విడుదలైన ‘దాయం’ చిత్రంకు కన్నన్ రంగస్వామి దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రంలో కొత్తవారిని నటీనటులుగా పరిచయం చేశారు. కాగా కన్నన్ రంగస్వామి గతవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై వడపళణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కన్నన్ రంగస్వామి తుదిశ్వాస విడిచారు. దాయం చిత్ర సంగీత దర్శకుడు సతీష్ సెల్వం దర్శకుని మృతదేహానికి అంజలి ఘటించారు. -
పుట్టపర్తి పర్యాటక అభివృద్ధికి చర్యలు
పుట్టపర్తి అర్బన్: ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో పుట్టపర్తి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ హెచ్ఓడీలు అనిల్ కె.గుప్తా, కన్నన్ పేర్కొన్నారు. పుట్టపర్తికి మంగళవారం విచ్చేసిన వారు ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, కార్యదర్శి ప్రసాద్‌రావును కలిశారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై వారు చర్చించారు. అనంతరం సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం, శిల్పారామంను సందర్శిం చారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల ప్యాకేజీని అందించే అవకాశం ఉందన్నారు. ఇందులో రాయల సీమ టూరిజం స ర్యూట్కు రూ.100 కోట్లు కేటాయించే అవకాశం ఉందన్నా రు. అనంతరం వా రు సత్యసాయి మ హా సమాధిని ద ర్శించుకున్నారు. కార్యక్రమంలో టెక్నికల్ మేనేజర్ శ్రీధర్, డివిజనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శనరావు, డీఈ ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
చోరీ సొమ్ము సీఐ స్వాహా
కేకేనగర్ : దొంగల వద్ద స్వాధీనం చేసుకున్న నగలను నేర విభాగ ఇన్స్పెక్టర్ స్వాహా చేసిన సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి సంబంధించిన సహాయ కమిషనర్ స్వయంగా విచారణ చేపట్టడంతో సెయింట్ థామస్ మౌంట్ పోలీసుస్టేషన్‌లోని పోలీసుల మధ్య సంచలనం కలిగించింది. నెల రోజుల క్రితం తాంబరం ముల్లైనగర్కు చెందిన దండపాణి (50) ఇంట్లో కరెంట్ రీడింగ్‌కు వచ్చినట్లు చెప్పి రూ.5 వేల నగదు, 5 సవర్ల నగలను చోరీ చేసి ఉడాయించాడు. దీంతో నెల నుంచి రెండు ప్రత్యేక బృంద పోలీసులను ఏర్పాటుచేశారు.దీంతో విచారణలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.ఇందులో వేలుస్వామి (35), ఆనందన్( 40) అని తెలిసింది. వారి ఇద్దరిని బీరకంకరనై పోలీసు ఇన్స్పెక్టర్ కన్నన్ వద్ద అప్పగించారు. వీరి నుంచి 80 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. నగలు పోగొట్టుకున్న వారిని పిలిచి 10 సవర్లు పోగొట్టుకున్నవారికి 7 సవర్లు, 5 సవర్లు, 3 సవర్లు ఇచ్చారు. మిగిలిన వాటిగురిచి అడిగితే కన్నన్ బాధితులను బెదిరించి పంపారు. దీంతో దండపాణి సెయింట్ థామస్ మౌంట్లోని సహాయ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో కన్నన్ను పిలిచి విచారణ జరపగా నగలు సగం స్వాహా చేసినట్లు తెలిసింది. దండపాణి ఇంట్లో చోరీ చేసిన నగలను తిరిగి అప్పగించారు. కన్నన్‌పై విచారణ చేపడుతున్నారు. -
విమానంలో పైలట్, ఇంజనీరు బాహాబాహీ
సాక్షి, చెన్నై: పైలట్, ఇంజనీరు కాక్‌పిట్‌లోనే కొట్టుకున్నారు. చెన్నై నుంచి ఢిల్లీ మీదుగా ఫ్రాన్స్‌లోని పారిస్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం శనివారమిక్కడ ఉదయం 8.45 గంటలకు 120 మంది ప్రయాణికులతో బయల్దేరింది. రన్‌వే పైనే సాంకేతిక లోపానికి గురికావడంతో ఇంజనీర్ కన్నన్ నేతృత్వంలో బృందం మరమ్మతులు చేసింది. పైలట్ మాణిక్‌లాల్ మరమ్మతు సరిగా చేయలేదనడంతో ఇంజనీర్ ‘మీరు విమానం సరిగా నడపండి’ అని అన్నాడు. దీంతో పైలట్ ఇంజనీరు ము ఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని కొట్టుకుంటూ విమానంలోనే దొర్లారు. ప్రయాణికులు భయంతో విమానం నుంచి దిగి రన్‌వేపై పరుగులు పెట్టారు. అధికారులు ఇద్దరినీ విమానాశ్రయంలోకి తీసుకెళ్లారు. ఇంజనీరును ఆస్పత్రిలో చేర్పిం చారు. విమానం 3 గంటలు ఆలస్యంగా వెళ్లింది. -
ప్రమాదాల నివారణకు ఎంటీసీ చర్యలు
టీనగర్, న్యూస్‌లైన్: బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుండడంతో విద్యార్థులు అధికంగా ప్రయాణించే బస్‌రూట్లను గుర్తించి పరి శీలన జరిపేందుకు నగర మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంటీసీ) సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబర్ 25వ తేదీన కోవలం నుంచి ప్యారిస్ వైపు వస్తున్న సిటీ బస్ (19జీ) ఫుట్‌బోర్డులో ప్రయాణించిన నీలాంగరై విద్యార్థి కన్నన్ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. గతవారం సుంగువారి సత్రం నుంచి తిరువళ్లూరుకు బయలుదేరిన ప్రభుత్వ బస్సు (టీ84ఎ) ఫుట్‌బోర్డులో ప్రయాణించిన 10వ తరగతి విద్యార్థి అరవింద్ 15 బన్నూరు బస్టాండ్ సమీపంలో జారిపడి మృతి చెందాడు. ఈ నెల తొమ్మిదవ తేదీన పెరంబూరు, మాధవరం హైరోడ్డులో వెళుతున్న సిటీ బస్సు (7జీ) ఫుట్‌బోర్డులో ప్రయాణించిన కార్తీక్ (16) కింద పడి మృతి చెందాడు. ఫుట్‌బోర్డు ప్రయాణాలతో అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడడంతో నిర్ణీత బస్సు రూట్లలో పీక్ అవర్స్‌లో ఎక్కువ బస్సులు నడపాలంటూ ఎంటీసీకీ విజ్ఞప్తులు అందాయి. బస్సు రూట్ల పరిశీలన: విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే రూట్ల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. బుధవారం ఎంటీసీ అధికారుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో ప్రమాదాలను నివారించేందుకు ఏఏ రూట్లలో అధిక బస్సులు నడపాలనే విషయపై చర్చలు జరిపారు. దీని గురించి నగర రవాణా సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ ఎంటీసీ ఆదాయ వనరుల విభాగానికి చెందిన ఆరుగురు సభ్యులతో బృందాలను ఏర్పరచి నగర మంతా పరిశీలన జరిపేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. నిర్ణీత బస్సు రూట్లలో అధిక సంఖ్యలో బస్సులు నడిపేందుకు చర్యలుతీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.