చోరీ సొమ్ము సీఐ స్వాహా | circle inspector crime in tamilnadu | Sakshi
Sakshi News home page

చోరీ సొమ్ము సీఐ స్వాహా

Published Sat, May 7 2016 3:10 PM | Last Updated on Mon, Aug 13 2018 2:57 PM

circle inspector crime in tamilnadu

కేకేనగర్ : దొంగల వద్ద స్వాధీనం చేసుకున్న నగలను నేర విభాగ ఇన్‌స్పెక్టర్ స్వాహా చేసిన సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి సంబంధించిన సహాయ కమిషనర్ స్వయంగా విచారణ చేపట్టడంతో సెయింట్ థామస్ మౌంట్ పోలీసుస్టేషన్‌లోని పోలీసుల మధ్య సంచలనం కలిగించింది. నెల రోజుల క్రితం తాంబరం ముల్లైనగర్‌కు చెందిన దండపాణి (50) ఇంట్లో కరెంట్ రీడింగ్‌కు వచ్చినట్లు చెప్పి రూ.5 వేల నగదు, 5 సవర్ల నగలను చోరీ చేసి ఉడాయించాడు.

దీంతో నెల నుంచి రెండు ప్రత్యేక బృంద పోలీసులను ఏర్పాటుచేశారు.దీంతో విచారణలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.ఇందులో వేలుస్వామి (35), ఆనందన్( 40) అని తెలిసింది. వారి ఇద్దరిని బీరకంకరనై పోలీసు ఇన్‌స్పెక్టర్ కన్నన్ వద్ద అప్పగించారు. వీరి నుంచి 80 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు.

నగలు పోగొట్టుకున్న వారిని పిలిచి 10 సవర్లు  పోగొట్టుకున్నవారికి 7 సవర్లు, 5 సవర్లు, 3 సవర్లు ఇచ్చారు. మిగిలిన వాటిగురిచి అడిగితే కన్నన్ బాధితులను బెదిరించి పంపారు. దీంతో దండపాణి సెయింట్ థామస్ మౌంట్‌లోని సహాయ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో కన్నన్‌ను పిలిచి విచారణ జరపగా నగలు సగం స్వాహా చేసినట్లు తెలిసింది. దండపాణి ఇంట్లో చోరీ చేసిన నగలను తిరిగి అప్పగించారు. కన్నన్‌పై విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement