విమానంలో పైలట్, ఇంజనీరు బాహాబాహీ
సాక్షి, చెన్నై: పైలట్, ఇంజనీరు కాక్‌పిట్‌లోనే కొట్టుకున్నారు. చెన్నై నుంచి ఢిల్లీ మీదుగా ఫ్రాన్స్‌లోని పారిస్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం శనివారమిక్కడ ఉదయం 8.45 గంటలకు 120 మంది ప్రయాణికులతో బయల్దేరింది. రన్‌వే పైనే సాంకేతిక లోపానికి గురికావడంతో ఇంజనీర్ కన్నన్ నేతృత్వంలో బృందం మరమ్మతులు చేసింది. పైలట్ మాణిక్‌లాల్ మరమ్మతు సరిగా చేయలేదనడంతో ఇంజనీర్ ‘మీరు విమానం సరిగా నడపండి’ అని అన్నాడు.
దీంతో పైలట్ ఇంజనీరు ము ఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని కొట్టుకుంటూ విమానంలోనే దొర్లారు. ప్రయాణికులు భయంతో విమానం నుంచి దిగి రన్‌వేపై పరుగులు పెట్టారు. అధికారులు ఇద్దరినీ విమానాశ్రయంలోకి తీసుకెళ్లారు. ఇంజనీరును ఆస్పత్రిలో చేర్పిం చారు. విమానం 3 గంటలు ఆలస్యంగా వెళ్లింది.