విస్తారా సీఈవో కణ్ణన్ వెల్లడి
న్యూఢిల్లీ: పైలట్ల ఆందోళనలతో ఫ్లయిట్ సర్విసులకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మే నెలాఖరుకల్లా అంతా సద్దుమణుగుతుందని, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొస్తాయని విమానయాన సంస్థ విస్తార సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. పైలట్లు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టామని, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నామని ఆయన వివరించారు.
ఫ్లయిట్ల సంఖ్య తగ్గవచ్చు గానీ ఈ వారాంతం నుంచి ఫ్లయిట్లను అప్పటికప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉండబోదని కణ్ణన్ పేర్కొన్నారు. కార్యకలాపాలను కుదించుకునే క్రమంలో 20–25 రోజువారీ ఫ్లయిట్స్‌ను తగ్గించినట్లు ఆయన వివరించారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులకు తమ సిబ్బంది తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు కణ్ణన్ తెలిపారు. విస్తారాలో 6,500 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 1,000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment