Flight Schedule
-
మే ఆఖరుకి సాధారణ స్థితికి కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పైలట్ల ఆందోళనలతో ఫ్లయిట్ సర్విసులకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మే నెలాఖరుకల్లా అంతా సద్దుమణుగుతుందని, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొస్తాయని విమానయాన సంస్థ విస్తార సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. పైలట్లు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టామని, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నామని ఆయన వివరించారు. ఫ్లయిట్ల సంఖ్య తగ్గవచ్చు గానీ ఈ వారాంతం నుంచి ఫ్లయిట్లను అప్పటికప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉండబోదని కణ్ణన్ పేర్కొన్నారు. కార్యకలాపాలను కుదించుకునే క్రమంలో 20–25 రోజువారీ ఫ్లయిట్స్‌ను తగ్గించినట్లు ఆయన వివరించారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులకు తమ సిబ్బంది తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు కణ్ణన్ తెలిపారు. విస్తారాలో 6,500 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 1,000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. -
విమాన సంస్థల వేసవి షెడ్యూల్ విడుదల
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. మార్చి 31 నుంచి అక్టోబర్ 26 వరకు 2024 ఏడాదికిగాను సమ్మర్ షెడ్యూల్‌ను ప్రకటించాయి. దేశీయంగా ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించాయి. గతంతో పోలిస్తే ఇది 6 శాతం అధికమని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వెల్లడించింది. ఇండిగో, ఎయిరిండియా, విస్తారాలు అత్యధికంగా విమాన సర్వీసులు నడపనుండగా..స్పైస్‌జెట్ మాత్రం తన సర్వీసుల సంఖ్యను తగ్గించుకుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో దేశీయ విమానయాన సంస్థలు అమెరికాతోపాటు బ్రిటన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవ్స్, జార్జియా.. వంటి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపాయి. దేశంలోని 27 విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ రూట్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. వారానికి 1,922 అంతర్జాతీయ సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. అందులో భాగంగా ఈ నెల 28 నుంచే ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ రూట్లో విమాన సేవలు ప్రారంభించనుంది. ఇండిగో ఈ సీజన్లో 13,050 విమాన సర్వీసులను నడపబోతున్నట్లు తెలిపింది. ఎయిరిండియా 2,278, విస్తారా 2,324, ఆకాశ ఎయిర్ 903 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. అంతర్జాతీయ రూట్లో ఎయిరిండియా 455 విమానాలు నడపనుండగా, ఇండిగో 731, విస్తారా 184కి పెంచుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, స్పైస్‌జెట్ మాత్రం తన సర్వీసులను 1,657కి కుదించింది. ఈ సీజన్ నుంచి కొత్తగా అజామ్‌గఢ్, అలిగఢ్, చిత్రకూట్, గోండియా, జలగాన్, మోరదాబాద్, పిథోర్‌గర్ విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించనున్న ప్రపంచ నం1 కంపెనీ.. కారణం.. -
హజ్‌యాత్ర విమాన షెడ్యూల్ ఖరారు
సాక్షి, అమరావతి: 2019 హజ్ యాత్ర విమాన షెడ్యూల్ ఖరారైంది. టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ సమయంలో కావాల్సిన పనులు చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్‌బాషా హజ్ యాత్రికులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏ విమానంలో ఏ తేదీన ప్రయాణం చేయనున్నారో ఆ సమాచారాన్ని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ యాత్రికులు దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నంబర్‌కు మెసేజ్ చేస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే హజ్ యాత్రికులు తమ సెల్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో విమాన బుకింగ్ నిర్ధారణ చేసుకోవాలి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి చేసుకోవచ్చు. లేదా జిల్లా హజ్ సొసైటీల సాయం తీసుకోవాలని ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తాజుద్దీన్ ఆరీఫ్ హజ్ యాత్రికులకు సూచించారు. ఆన్లైన్ విమాన బుకింగ్‌ను నిర్ధారణ చేసుకోవడం వల్ల తమ ప్రయాణానికి 48 గంటల ముందే నాంపల్లి హజ్‌హౌస్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం 10 గంటల ముందు వెళ్తే సరిపోతుంది. - ఆంధ్రప్రదేశ్ యాత్రికులు వెళ్లే మొదటి విమానం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5375 జూలై 31న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా బయలు దేరనుంది. ఈ విమానంలో గుంటూరుకు చెందిన 207 మంది, కృష్ణా జిల్లాకు చెందిన 113 మంది, విశాఖపట్నం ఇద్దరు, పశ్చిమగోదావరికి వాసులు 20 మంది కలిపి మొత్తం 342 మంది వెళ్లనున్నారు. - ఆగస్టు 1న మధ్యాహ్నం 12:45 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5383 విమానంలో 343 మంది యాత్రికులతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా బయలుదేరనుంది. ఈ విమానంలో తూర్పుగోదావరి నుంచి నలుగురు, గుంటూరు జిల్లాకు చెందిన 85 మంది, కృష్ణ్లాకు చెందిన 75 మంది, కర్నూలు 111, నెల్లూరు 19, ప్రకాశం 10, విశాఖపట్నం 23, విజయనగరం జిల్లాకు చెందిన 16 మంది ప్రయాణికులు వెళ్తారు. - ఆగస్టు 2న మధ్యాహ్నం 12:55 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5391 విమానంలో కర్నూలు జిల్లాకు చెందిన 268 మంది యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా వెళ్తారు. - ఆగస్టు 3న మధ్యాహ్నం 12:55 నిమిషాలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5403 విమానంలో తూర్పుగోదావరికి చెందిన 28 మంది, కడపకు చెందిన 199 మంది, కర్నూలు 31, నెల్లూరు ఐదుగురు, శ్రీకాకుళం నలుగురు, విశాఖపట్నం 55, విజయనగరం నలుగురు, పశ్చిమగోదావరికి చెందిన 17 మంది.. మొత్తం 343 మంది హజ్ యాత్రకు వెళ్తారు. - ఆగస్టు 3న మధ్యాహ్నం 12:55 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ–5397లో హైదరాబాద్ నుంచి ఆరుగురు, కడప 11, కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు, కర్నూలు 10, నెల్లూరు 64, ప్రకాశం 26, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన 163 మంది, కలబుర్గీ 20, రాయచూర్ 5, యాదగిరికి చెందిన 31 మంది.. మొత్తం 341 మంది హజ్ యాత్రకు ఈ విమానంలో వెళ్లనున్నారు. -
రేపటి నుంచి హజ్ క్యాంప్
24 గంటల ముందు రిపోర్టు ఏర్పాట్లు పూర్తి చేసిన హజ్ కమిటీ హైదరాబాద్: హైదరాబాద్‌లో హజ్ హౌస్‌లో రేపటి నుంచి హజ్ క్యాంప్-2016 ప్రారంభం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఇక్కడి నుంచే బయలు దేరనున్నందున ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. హజ్ హౌస్‌తో పాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న భవన సముదాయంలో యాత్రికులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఆవరణలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. యాత్రికులతో పాటు వారి వెంట వచ్చే బంధుమిత్రులకు భోజనాల సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఈనెల 21 నుంచి తెలంగాణ, 24 నుంచి ఆంధ్రప్రదేశ్ యాత్రికుల విమాన షెడ్యూల్ ఉండటంతో రెండు రోజుల ముందే హజ్ క్యాంప్‌లో రిపోర్టు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కరెన్సీ మార్పిడి కోసం బ్యాంక్, ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. హజ్ క్యాంప్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తరలించేందుకు ప్రతి బృందానికి ఒక ప్రత్యేక బస్సును వినియోగించనున్నారు. రెండు రాష్ట్రాల హజ్ కమిటీలు ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశాయి.