రేపటి నుంచి హజ్ క్యాంప్
24 గంటల ముందు రిపోర్టు
ఏర్పాట్లు పూర్తి చేసిన హజ్ కమిటీ
హైదరాబాద్: హైదరాబాద్‌లో హజ్ హౌస్‌లో రేపటి నుంచి హజ్ క్యాంప్-2016 ప్రారంభం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఇక్కడి నుంచే బయలు దేరనున్నందున ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. హజ్ హౌస్‌తో పాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న భవన సముదాయంలో యాత్రికులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఆవరణలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. యాత్రికులతో పాటు వారి వెంట వచ్చే బంధుమిత్రులకు భోజనాల సౌకర్యం కూడా కల్పించనున్నారు.
ఈనెల 21 నుంచి తెలంగాణ, 24 నుంచి ఆంధ్రప్రదేశ్ యాత్రికుల విమాన షెడ్యూల్ ఉండటంతో రెండు రోజుల ముందే హజ్ క్యాంప్‌లో రిపోర్టు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కరెన్సీ మార్పిడి కోసం బ్యాంక్, ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. హజ్ క్యాంప్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తరలించేందుకు ప్రతి బృందానికి ఒక ప్రత్యేక బస్సును వినియోగించనున్నారు. రెండు రాష్ట్రాల హజ్ కమిటీలు ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశాయి.