
చెన్నై: కోలీవుడ్ వర్థమాన సినీ దర్శకుడు కన్నన్ రంగస్వామి (27) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తమిళంలో గత మార్చిలో విడుదలైన ‘దాయం’ చిత్రంకు కన్నన్ రంగస్వామి దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రంలో కొత్తవారిని నటీనటులుగా పరిచయం చేశారు. కాగా కన్నన్ రంగస్వామి గతవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై వడపళణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కన్నన్ రంగస్వామి తుదిశ్వాస విడిచారు. దాయం చిత్ర సంగీత దర్శకుడు సతీష్ సెల్వం దర్శకుని మృతదేహానికి అంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment