మణికంఠన్ దర్శకత్వంలో సంతానం | santahm in the direction manikanthan | Sakshi
Sakshi News home page

మణికంఠన్ దర్శకత్వంలో సంతానం

Published Wed, Aug 3 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

మణికంఠన్ దర్శకత్వంలో సంతానం

మణికంఠన్ దర్శకత్వంలో సంతానం

దిల్లుక్కుదుడ్డు చిత్రంతో వసూళ్ల వర్షం కు రిపించిన నటుడు సంతానంకు ప్రస్తుతం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు ఆయనతో చిత్రాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రాల ఎంపికలో తొందరపడని సంతానం తాజాగా కన్నాలడ్డు తిన్న ఆశై యా చిత్ర దర్శకుడు మణికంఠన్‌కు మరో అవకాశం ఇచ్చారు. వీరి కాంబినేషన్‌లో వాసస్ విజువల్స్ వేంచర్స్ అధినేతలు కేఎస్.శీనివాసన్, కేఎస్.శివరామన్ ఒక వి నోదభరిత కథా చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు.ఇంతకు ముందు బాస్ ఎన్గి ర భాస్కరన్, నాన్‌కడవుల్, నిమిర్నుదు నిల్ వంటి విజయవంతమైన చి త్రాలను నిర్మిం చిన ఈ నిర్మాతలు నూతన చిత్ర వివరాలను తెలుపుతూ సంతానం, మణికఠన్‌ల కాంబి నేషన్‌లో చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన పూర్తి వినోదభరిత ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు.

ఇందులో నటిం చే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.అక్టోబర్ నుం చి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాసన్ బ్రదర్స్, శివశ్రీ పిక్చర్స్, వాసన్ విజు వల్స్ వెంచర్స్ అనుబంధ సంస్థలు గత 60 ఏళ్లుగా చిత్రాలను నిర్మిస్తున్నాయి. ఈ సంస్థలు 55కు పైగా ఉత్తమ చిత్రాలను అందించాయన్నది గమనార్హం. ప్రస్తుతం బాలాజీ ధరణీ ధరన్ దర్శకత్వంలో కాళీ దాస్ జయరామ్ హీరోగా ఒరుపక్క కథై అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే సంతానం కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారన్న మాట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement