Manikanthan
-
రజనీ కోసం ఆ ముగ్గురు..
తమిళసినిమా: దక్షిణాది సినిమానే కాదు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కమలహాసన్, రజనీకాంత్ చుట్టూనే తిరుగుతున్నాయన్నది వాస్తవం. వీరిలో కమలహాసన్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. నిర్మాణంలో ఉన్న విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చేయనున్నట్లు ప్రకటించినా ఇండియన్ 2 చిత్రాలనే ఆయన నుంచి ఆశించవచ్చు. ఇక రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం కార్యక్రమాలు ముమ్మరంగా జరగుతున్నాయి. ఆయన త్వరలోనే పార్టీ జండా, అజెండాలను వెల్లడించే సమయం ఆసన్నమైంది. రజనీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న విషయం తెలిసిందే. శంకర్ ఈ చిత్రాన్ని నభూతోనభవిష్యత్ అనే విధంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో తన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మాణంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించిన కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. ఇక రజనీకాంత్ మరో చిత్రం చేస్తారా, 2.ఓ చివరి చిత్రం అవుతుందా? అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేశారు. సూపర్‌స్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం తమ చిత్రాలను పట్టాలెక్కించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. యువ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజారాణి, తెరి, మెర్శల్ చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ఇక మరో వర్థమాన దర్శకుడు మణికంఠన్ కాక్కాముట్టై చిత్రంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ ఇద్దరూ రజనీకాంత్ కోసం కథలను సిద్ధం చేసి ఆయనకు వినిపించారు కూడా. మరో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్ కూడా సూపర్‌స్టార్ కోసం బ్రహ్మాండమైన కథను సిద్ధం చేశారట. అట్లి, కేవీ.ఆనంద్ రాజకీయ ఇతివృత్తంతో కథలను తయారు చేయగా కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణకంఠన్ వ్యవసాయం నేపథ్యంలో కథను రెడీ చేశారట. ఈ మూడు కథలు రజనీకాంత్‌ను ఇంప్రెస్ చేశాయని, వీరిలో ఏవరికి ఆయన పచ్చజెండా ఊపుతారన్నది ఆసక్తికరంగా మారిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
మణికంఠన్ దర్శకత్వంలో సంతానం
దిల్లుక్కుదుడ్డు చిత్రంతో వసూళ్ల వర్షం కు రిపించిన నటుడు సంతానంకు ప్రస్తుతం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు ఆయనతో చిత్రాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రాల ఎంపికలో తొందరపడని సంతానం తాజాగా కన్నాలడ్డు తిన్న ఆశై యా చిత్ర దర్శకుడు మణికంఠన్‌కు మరో అవకాశం ఇచ్చారు. వీరి కాంబినేషన్లో వాసస్ విజువల్స్ వేంచర్స్ అధినేతలు కేఎస్.శీనివాసన్, కేఎస్.శివరామన్ ఒక వి నోదభరిత కథా చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు.ఇంతకు ముందు బాస్ ఎన్గి ర భాస్కరన్, నాన్‌కడవుల్, నిమిర్నుదు నిల్ వంటి విజయవంతమైన చి త్రాలను నిర్మిం చిన ఈ నిర్మాతలు నూతన చిత్ర వివరాలను తెలుపుతూ సంతానం, మణికఠన్ల కాంబి నేషన్‌లో చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన పూర్తి వినోదభరిత ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటిం చే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.అక్టోబర్ నుం చి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాసన్ బ్రదర్స్, శివశ్రీ పిక్చర్స్, వాసన్ విజు వల్స్ వెంచర్స్ అనుబంధ సంస్థలు గత 60 ఏళ్లుగా చిత్రాలను నిర్మిస్తున్నాయి. ఈ సంస్థలు 55కు పైగా ఉత్తమ చిత్రాలను అందించాయన్నది గమనార్హం. ప్రస్తుతం బాలాజీ ధరణీ ధరన్ దర్శకత్వంలో కాళీ దాస్ జయరామ్ హీరోగా ఒరుపక్క కథై అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే సంతానం కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారన్న మాట. -
రజనీ తరపున ఆశీస్సులందిస్తున్నా!
రజనీకాంత్‌తో పలు చిత్రాలు చేశాను. ఆయన సహాయకుడి జయరామన్ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన నిర్మాతగా మారడం సంతోషం. యనకు, సహ నిర్మాతలకు నాతోపాటు రజనీకాంత్ తరపున కూడా శుభాశీస్సులు అందిస్తున్నానని సీనియర్ దర్శకుడు ఎస్పి.ముత్తురామన్ పేర్కొన్నారు. కే జయరామన్, ఎల్ పృథ్వీరాజ్, ఎస్ రాజేంద్రన్, రజనీ జయరామన్ సంయుక్తంగా జేపి ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం క్రిమి. మదయానై కూటం చిత్రం ఫేమ్ కదిర్, రేష్మీమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనుచరణ్ దర్శకుడు. కాక్కముట్టై చిత్ర దర్శకుడు మణికంఠన్ కథను అందించిన సంగీత దర్శకుడు కే సంగీత బాణీలు కట్టారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఆవిష్కరించి తొలి సీడీని నటుడు విజయ్‌సేతుపతికి అందించారు. ఎస్పీ ముత్తురామన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్ థాను, నక్కిరన్ గోపాల్, పీఎల్ తేనప్పన్, కదిరేశన్, కాక్కముట్టై చిత్ర దర్శకుడు మణికంఠన్, చిత్ర హీరోహీరోయిన్లు కదిర్, రేష్మీమీనన్ పాల్గొన్నారు.