రజనీ తరపున ఆశీస్సులందిస్తున్నా!
రజనీకాంత్‌తో పలు చిత్రాలు చేశాను. ఆయన సహాయకుడి జయరామన్ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన నిర్మాతగా మారడం సంతోషం. యనకు, సహ నిర్మాతలకు నాతోపాటు రజనీకాంత్ తరపున కూడా శుభాశీస్సులు అందిస్తున్నానని సీనియర్ దర్శకుడు ఎస్‌పి.ముత్తురామన్ పేర్కొన్నారు. కే జయరామన్, ఎల్ పృథ్వీరాజ్, ఎస్ రాజేంద్రన్, రజనీ జయరామన్ సంయుక్తంగా జేపి ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం క్రిమి. మదయానై కూటం చిత్రం ఫేమ్ కదిర్, రేష్మీమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనుచరణ్ దర్శకుడు.
కాక్కముట్టై చిత్ర దర్శకుడు మణికంఠన్ కథను అందించిన సంగీత దర్శకుడు కే సంగీత బాణీలు కట్టారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు ఎస్‌పీ ముత్తురామన్ ఆవిష్కరించి తొలి సీడీని నటుడు విజయ్‌సేతుపతికి అందించారు. ఎస్‌పీ ముత్తురామన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్ థాను, నక్కిరన్ గోపాల్, పీఎల్ తేనప్పన్, కదిరేశన్, కాక్కముట్టై చిత్ర దర్శకుడు మణికంఠన్, చిత్ర హీరోహీరోయిన్లు కదిర్, రేష్మీమీనన్ పాల్గొన్నారు.