యాక్టర్స్ అందరూ దాదాపుగా సోషల్ మీడియాలో ఉంటారు. అభిమానుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ టచ్ లో ఉంటారు. రెగ్యులర్ గా అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. కాబట్టి 'త్రో బ్యాక్' పిక్స్ పేరిట కొన్నింటిని షేర్ చేస్తూ ఉంటారు. అలా కార్తీ షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
(ఇదీ చదవండి: అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి)
ఇందులో కార‍్తీతో పాటు ఓ మహిళ ఉన్నట్లు కనిపిస్తుంది. కాకపోతే అతడో స్టార్ కమెడియన్. సినిమాలో పాత్ర కోసం అమ్మాయిలా తయారయ్యాడు. అతడెవరో గుర్తుపట్టారా? బహుశా గుర్తుపట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే సదరు హాస్యనటుడు తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. కార్తీ పక్కన లేడీ గెటప్ లో ఉన్న కమెడియన్ సంతానం.
2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్న సంతానం.. తమిళంలోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించాడు. తన మేనరిజమ్స్, కామెడీతో ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించాడు. 2013 నుంచి కెరీర్ లో మరో మెట్టు ఎదిగిన ఇతడు.. హీరోగా మారాడు. అప్పటినుంచి లీడ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం కిక్, డీడీ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరోవైపు కార్తీ కూడా 'జపాన్' సినిమా చేస్తున్నాడు. త్వరలో ఇది థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment