Tamil movies
-
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్‌పుల్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్‌గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్
యంగ్ హీరోయిన్.. సినీ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పింది. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం పెట్టిన పోస్ట్‌పై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చేసింది. తనకు తమిళ ఆడియెన్స్ అంటే ఎంతో గౌరవమని చెప్పింది. అలానే అప్పట్లోని స్టేట్మెంట్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ అప్పుడేం జరిగింది? నటి ధన్య ఇప్పుడెందుకు సారీ చెప్పిందో తెలుసా? (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. డేట్ ఫిక్స్) బెంగళూరులో పుట్టి పెరిగిన ధన్య బాలకృష్ణ.. తెలుగు, తమిళంలో బోలెడన్ని సినిమాలు చేసింది. హీరోయిన్, సహాయ పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. ఈమె నటించిన 'లాల్ సలామ్' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సరిగ్గా ఇప్పుడు ఓ పాత గొడవ బయటకొచ్చింది. గతంలో తమిళ ప్రేక్షకులని కించపరిచేలా 2012లో ఫేస్బుక్లో ఈమె పోస్ట్ పెట్టిందని చెబుతూ ఓ స్క్రీన్ షాట్‌ని వైరల్ చేశారు. దీని వల్ల తమిళ నెటిజన్స్.. ఈమెకు చుక్కలు చూపించారు. దీంతో ధన్య ఆ పోస్టుపై క్లారిటీ ఇచ్చేసింది. 12 ఏళ్ల పోస్ట్‌లో ఏముంది? 'ప్రియమైన చెన్నై, మీరు అడుక్కుంటే మేం నీళ్లిచ్చాం. మీరు అడుక్కుంటే కరెంట్ ఇచ్చాం. మీరు వచ్చి మా అందమైన నగరాన్ని ఆక్రమించారు. క్షమాపణ చెబితే మేం దయతలచి ఫ్లే ఆఫ్స్‌కి వెళ్లేలా చేస్తాం. మీరు అడుక్కుంటే మేం ఇస్తాం' అని అప్పట్లో ధన్య బాలకృష్ణ రాసిన ఫేస్బుక్ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ స్క్రీన్ షాట్‌పై స్పందించిన నటి ధన్య.. సోషల్ మీడియాలో పెద్ద నోట్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఇప్పుడు ఏం చెప్పింది? 'నా వృత్తి, తినే తిండి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ కామెంట్స్ నేను చేయలేదు. అది నా అభిప్రాయం కాదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. అది ట్రోలింగ్కి సృష్టించిన స్క్రీన్ షాట్. ఇన్నేళ్లు ఎందుకు దీనిపై స్పందించలేదా అని మీరనుకోవచ్చు. కానీ ఇన్నేళ్లలో నాకు, నా కుటుంబానికి చాలా బెదిరింపులు వచ్చాయి. వాళ్లని కాపాడుకోవడంలో భాగంగా నేను సైలెంట్‌గా ఉండిపోవాల్సి వచ్చింది' 'కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ నేను చేయలేదని పక్కాగా చెబుతున్నాను. నేను తమిళ ఇండస్ట్రీలోనే నటిగా కెరీర్ మొదలుపెట్టాను. ఇక్కడ పనిచేస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. నాకు తమిళ ప్రేక్షకులే ఫస్ట్ ఆడియెన్స్. ఓ మహిళగా నేను ఎవరినీ హర్ట్ చేయలేదు. చేయను కూడా. ఈ స్టేట్మెంట్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నేను ఇందులో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తమిళ ప్రేక్షకులందరికీ క్షమాపణ చెబుతున్నాను' అని నటి ధన్య బాలకృష్ణ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) -
కోలీవుడ్ హిట్ సినిమాలు హిందీలోనూ హిట్ ఆవుమా?
ఓ సినిమా హిట్ అయితే... ఆ సినిమాలోని కథ ఏ భాషకైనా, ప్రాంతానికైనా నప్పే విధంగా ఉంటే.. అందరి దృష్టీ ఆ సినిమా మీద పడుతుంది. అలా తమిళంలో హిట్టయిన చిత్రాల మీద హిందీ పరిశ్రమ దృష్టి పడింది. ఆ చిత్రాల రైట్స్ చేజిక్కించుకుని, రీమేక్ చేస్తున్నారు. మరి.. తమిళంలో హిట్ ఆన (అయిన) సినిమా హిందీలోనూ హిట్ ఆవుమా? (అవుతుందా?) అంటే.. వేచి చూడాల్సిందే. ఇక హిందీలో రీమేక్ అవుతున్న తమిళ చిత్రాల గురించి తెలుసుకుందాం. విమానయానం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితంతో సుధ కొంగర దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’). సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజై, మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. సుధా కొంగరే రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రీమేక్‌కు సూర్య ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సామాన్యులు సైతం విమానయానం చేసేందుకు గోపీనాథ్ ఏ విధంగా కృషి చేశారు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అనేది ‘సూరరై పోట్రు’ కథాంశం. అలాగే విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ (2014) రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారని సమాచారం. హిందీ రైట్స్‌ను దర్శక–నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ దక్కించుకున్నారు. హిందీ అపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (‘అపరిచితుడు’) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు శంకర్ ప్రకటించారు. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాల్సింది. కొన్ని లీగల్ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై మానసిక వేదనకు గురైన ఓ మధ్యతరగతి యువకుడు ఏం చేశాడు? అనేది ఈ చిత్రం కథాంశం. గ్యాంగ్‌స్టర్ సెంటిమెంట్ చెల్లెలి సంరక్షణ కోసం ఓ గ్యాంగ్‌స్టర్ తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు? ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్లలకు ఎలా బుద్ధి చెప్పాడు? అనే అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘వేదాళం’. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ సినిమా హిట్ సాధించింది. ఈ సినిమా ‘వేద’గా హిందీలో రీమేక్ అవుతోంది. జాన్ అబ్రహాం టైటిల్ రోల్ చేస్తున్నారు. నిఖిల్ అద్వానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్స్ తమన్నా, శర్వారి లీడ్ రోల్స్ చేస్తున్నారు. జాన్ అబ్రహాం సిస్టర్‌గా శర్వారి, హీరోయిన్గా తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 16ఏళ్లు కోమాలో ఉంటే.. దాదాపు 16 సంవత్సరాలు కోమాలో ఉన్న ఓ వ్యక్తి ఆరోగ్యం హఠాత్తుగా కుదుటపడుతుంది. కోమా నుంచి బయటకు వచ్చిన అతను సమకాలీన నాగరికత, జీవన విధానం, టెక్నాజీలను చూసి ఆశ్చర్యపో తాడు. ఈ పరిస్థితులను అతడు తన జీవితానికి ఎలా అన్వయించుకున్నాడు? తన పూర్వీకులకు చెందిన ఓ విగ్రహం అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నది ‘కోమాళి’ కథనం. ‘జయం’ రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తారని బాలీవుడ్లో ఎప్పట్నుంచో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటు పోలీస్.. అటు ఎన్ఆర్ఐ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇటీవల రీమేక్స్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తన్న ఓ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తమిళ దర్శకుడు కాలిస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన తమిళ హిట్ ఫిల్మ్ విజయ్ ‘తేరి’కి ఇది హిందీ రీమేక్ అని బాలీవుడ్ సమాచారం. ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఓ యువతిపై అత్యాచారం చేస్తే, అతన్ని చంపేస్తాడు ఓ పో లీసాఫీసర్. అప్పడు ఆ రాజకీయ నాయకుడు ఆ పోలీసాఫీసర్‌పై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? ఆ రాజకీయ నాయకుణ్ణి ఆ పోలీసాఫీసర్ ఎలా ఢీ కొన్నాడు? అన్నదే టూకీగా ‘తేరి’ కథాంశం. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. అలాగే మరో తమిళ హిట్ ‘మనాడు’ హిందీ రీమేక్‌లో కూడా వరుణ్ ధావన్ నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. శింబు, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మానాడు’. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ రానా వద్ద ఉన్నాయి. ఓ ఎన్ఆర్ఐకి, పో లీసాఫీసర్కి మధ్య కొన్ని రాజకీయ అంశాల నేపథ్యంలో ఎలాంటి శత్రుత్వం ఏర్పడింది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఎన్ఆర్ఐగా శింబు నటించగా, పోలీసాఫీసర్‌గా ఎస్జే సూర్య నటించారు. ట్రెండీ లవ్‌స్టోరీ రూ. 5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను సాధించిన తమిళ ట్రెండీ లవ్‌స్టోరీ ‘లవ్ టుడే’. ప్రదీప్ రంగనాథన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్. గత ఏడాది నవంబరులో విడుదలైన ఈ సినిమా హిందీ రీమేక్‌ను ఫ్యాంథమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నాయి. ఇందులో హీరో హీరోయిన్లుగా ఆమిర్ ఖాన్ పెద్ద కొడుకు జైనైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్లు ఫైనల్ అయ్యారని, షూటింగ్ కూడా మొదలైందని బాలీవుడ్ సమాచారం. ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి పరస్పర అంగీకారంతో వారి మొబైల్ ఫోన్స్‌ను మార్చుకున్నప్పుడు ఏం జరిగింది? అనే అంశంతో ‘లవ్ టుడే’ చిత్రం రూపొందింది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని తమిళ సినిమాలు కూడా హిందీలో రీమేక్ కానున్నాయని తెలుస్తోంది. -
లేడీ గెటప్‌లో ఉన్న ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
యాక్టర్స్ అందరూ దాదాపుగా సోషల్ మీడియాలో ఉంటారు. అభిమానుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ టచ్ లో ఉంటారు. రెగ్యులర్ గా అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. కాబట్టి 'త్రో బ్యాక్' పిక్స్ పేరిట కొన్నింటిని షేర్ చేస్తూ ఉంటారు. అలా కార్తీ షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. (ఇదీ చదవండి: అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి) ఇందులో కార్తీతో పాటు ఓ మహిళ ఉన్నట్లు కనిపిస్తుంది. కాకపోతే అతడో స్టార్ కమెడియన్. సినిమాలో పాత్ర కోసం అమ్మాయిలా తయారయ్యాడు. అతడెవరో గుర్తుపట్టారా? బహుశా గుర్తుపట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే సదరు హాస్యనటుడు తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. కార్తీ పక్కన లేడీ గెటప్ లో ఉన్న కమెడియన్ సంతానం. 2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్న సంతానం.. తమిళంలోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించాడు. తన మేనరిజమ్స్, కామెడీతో ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించాడు. 2013 నుంచి కెరీర్ లో మరో మెట్టు ఎదిగిన ఇతడు.. హీరోగా మారాడు. అప్పటినుంచి లీడ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం కిక్, డీడీ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరోవైపు కార్తీ కూడా 'జపాన్' సినిమా చేస్తున్నాడు. త్వరలో ఇది థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Karthi Sivakumar (@karthi_offl) (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
సెక్స్ రాకెట్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్!
చెన్నై : సెక్స్ రాకెట్ కేసులో తమిళ సీనియర్ నటి సంగీత బాలన్ అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనతో తమిళ సినీవర్గాల్లో కలకలం రేగింది. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సంగీత బాలన్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులు సహా పలువురు యువతులను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. నటి సంగీతతో పాటు సురేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ధర్మాసనం ఇద్దరికి కస్టడీ విధించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను రెస్క్యూహోంకు తరలించారు. ఈ సెక్స్ రాకెట్లో సంగీత బాలన్‌తో పాటు మరికొందరి సీని ప్రముఖుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో కరుప్పు రోజా తమిళ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన సంగీత బాలన్ అనంతరం పలుచిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. అనేక టీవీ ప్రొగ్రామ్స్‌లో కూడా నటించారు. రాధిక శరత్ కుమార్ ‘వాణి రాణి’ సీరియల్లో సంగీత బాలన్ అత్త పాత్రతో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. -
ఆయనవి ఆరోపణలు మాత్రమే: విశాల్
సాక్షి, చెన్నై: నటుడు ఎస్వీ. శేఖర్ ఆరోపణలు ఆమోదయోగ్యంగా లేవని నడిగర్ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్ పేర్కొన్నారు. ఎస్వీ.శేఖర్ మలేషియాలో సీనియర్ కళాకారులకు గౌరవం లభించలేదని, నిర్వాహకులు అవకతవకలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు చేస్తూ సంఘం ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలేషియా నుంచి వచ్చిన విశాల్ మీడియాతో మాట్లాడారు. మలేషియాలో స్టార్స్ క్రికెట్, తదితర కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయన్నారు. కార్యక్రమానికి చేకూరిన నిధుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఎస్వీ. శేఖర్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఆరోపణలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. మలేషియాలో సీనియర్ కళాకారులందరికీ గౌరవం లభించిందని స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని విశాల్ విజ్ఞప్తి చేశారు. సమ్మె కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది సాధారణ ప్రజలేనన్నారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి స్పందించాల్సిందిగా అడిగిన ప్రశ్నకు... రజనీకాంత్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారని, తన మద్దతు ఎవరికన్నది ఎన్నికల సమయంలో ప్రకటిస్తానని విశాల్ తెలిపారు. -
నేను అప్పట్లోనే కమలహాసన్ అభిమానిని
తమిళ చిత్రాలపై దృష్టి సారించినట్లున్నారు నటి విద్యాబాలన్. బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ బెంగళూరు భామ తమిళంలో చివరగా గురు చిత్రంలో నటించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ప్రధాన నాయకి ఐశ్వర్యారాయ్. కాగా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత ఒక తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా ఆ చిత్ర నిర్మాతతో విభేదాల కారణంగా తప్పుకున్నారు. దీంతో తమిళ చిత్రాలపైనే కోపం పెంచుకున్న విద్యాబాలన్ హిందీ, మలయాళ చిత్రాలకే పరిమితం అయిపోయారు. అలాంటిది తాజాగా తమిళ చిత్రాల్లో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేయడం విశేషం. ప్రస్తుతం హిందీలో అవకాశాలు తగ్గడమే కారణమా? ఇందుకు ఆమె ఏం చెబుతున్నారో చూద్దాం. నా ఆలోచనలు చిన్నతనంలో చెన్నైలో గడిపిన రోజులు వైపు మల్లుతున్నాయి. నేను అప్పట్లోనే కమలహాసన్ అభిమానిని. ఒకసారి ఆయన్ని కలవడానికి కమల్ ఇంటికితీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో లేరు. అయితే ఆయన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఫొటో నాకు లభించింది. అప్పట్లో అదే పెద్ద థ్రిల్లింగ్ కలిగించిన విషయం. తమిళ చిత్రాలకు దూరం అయ్యారేంటి? అని చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే తమిళ, మలయాళం నాకు మాతృభాషలాంటివి. మంచి స్క్రిప్ట్ దొరికితే తమిళంలో నటించడానికి ఎప్పుడు సిద్ధమే. గత 2008 నుంచి నేను చిత్రాలను తగ్గించుకుంటున్నాను. ఏడాదికి ఒక్క చిత్రంలోనే నటిస్తున్నాను. షూటింగ్ ప్రాంతాలకు దూరంగా బాహ్య జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అంటున్నారు నటి విద్యాబాలన్.