
సంగీత బాలన్ (ఫైల్ ఫొటో)
చెన్నై : సెక్స్ రాకెట్ కేసులో తమిళ సీనియర్ నటి సంగీత బాలన్ అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనతో తమిళ సినీవర్గాల్లో కలకలం రేగింది. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సంగీత బాలన్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులు సహా పలువురు యువతులను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. నటి సంగీతతో పాటు సురేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ధర్మాసనం ఇద్దరికి కస్టడీ విధించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను రెస్క్యూహోంకు తరలించారు.
ఈ సెక్స్ రాకెట్‌లో సంగీత బాలన్‌తో పాటు మరికొందరి సీని ప్రముఖుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో కరుప్పు రోజా తమిళ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన సంగీత బాలన్ అనంతరం పలుచిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. అనేక టీవీ ప్రొగ్రామ్స్‌లో కూడా నటించారు. రాధిక శరత్ కుమార్ ‘వాణి రాణి’ సీరియల్‌లో సంగీత బాలన్ అత్త పాత్రతో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment