
మే 9న వల్లవునుక్కు పుల్లుం ఆయుధం
వల్లవునుక్కు పుల్లుం ఆయు ధం చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 9న విడుదల కానుంది. ప్రముఖ హాస్యనటుడు సం తానం తొలిసారి సోలో హీరో గా నటిస్తున్నా రు. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న చిత్రానికి రేమేక్ ఇది. ఈ చిత్రానికి శ్రీనాథ్ దర్శకుడు. ముంబయి మోడల్ అష్నా జువేరి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో నాగినీడు, మిర్చి సెంథిల్, వీటీవీ గణేష్, రాజ్‌కుమరన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.సిద్ధార్థ్ లిపిన్ సంగీత స్వరాలు అంది స్తున్నారు. ఈ చిత్రం గురించి పీవీపీ నిర్వాహకులు తెలుపుతూ వల్లవునుక్కు పుల్లుం ఆయుధం చిత్రం రొమాంటిక్ ఫ్యామి లీ ఎంటర్‌టైనరని పేర్కొన్నారు.
సంతానం ఇందులో వాటర్ క్యాన్లు సరఫరా చేసే యువకుడిగా నటిస్తున్నారని తెలి పారు. దురదృష్టం ముందు పుట్టి ఆ తర్వాత తను పుట్టాడన్నట్టుండే సంతానం ఉన్న పని ఊడడంతో సొంత ఊరులో తల్లిదండ్రులు సొత్తు ఉందని తెలిసి దాన్ని అమ్మి మంచి వ్యాపారం చేసుకుందామనే ఆశతో ఆ గ్రామానికి వెళతాడన్నారు. అక్కడ ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలో చిక్కుకుని ఎలాంటి పాట్లు పడ్డాడు? చివరికి ఎలా బయటపడ్డాడు? అన్న పలు ఆసక్తికరమైన అంశాల సమాహారంగా వల్లవునుక్కు పుల్లుం ఆయుధం చిత్రం ఉంటుందన్నారు. దీనికి ఒక ప్రము ఖ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలిపారు. చిత్రంలో పలు హైలెట్స్ ఉన్నా సంతానం ప్రత్యేక ఆకర్షణగా పేర్కొన్నారు. చిత్ర ఆడియోను ఈ నెల 14న, చిత్రం విడుదలను మే 9న చేయనున్నట్లు తెలిపారు.