
విజయ్ దేవరకొండకు పోటీ ఇవ్వనున్న సంతానం
స్టార్ కమెడియన్ సంతానం హీరో గా తెరకెక్కిన చిత్రం ‘సర్వర్ సుందరం’. సంతానంకు జోడిగా వైభవి నటిస్తున్న ఈ చిత్రంలో రాధా రవి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2016లోనే పూర్తయినప్పటికీ రకరకాల కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్‌కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు పోటీగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ వంటి సెన్సెషన్ స్టార్ సినిమా వస్తున్న రోజే ‘సర్వర్ సుందరం’రిలీజ్ అవుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా కోసం సంతానం హోటల్ సర్వర్‌గా ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా ఆడియన్స్‌ను ఫుల్‌గా అలరిస్తాడని చిత్ర బృందం పేర్కొంది. అంతేకాకుండా మాస్ ఎలిమెంట్స్‌కు కూడా ఢోకా లేదని తెలిపారు. బల్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ హర్ష వడ్డెల, డి. వెంకటేష్‌లు నిర్మించారు.