మళ్లీ ఆయనే ఇచ్చారు | Santhanam's next film is with director Selvaraghavan | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆయనే ఇచ్చారు

Published Mon, Aug 22 2016 2:34 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

మళ్లీ ఆయనే ఇచ్చారు

మళ్లీ ఆయనే ఇచ్చారు

 సిఫారసులు బాగా పనిచేస్తాయి. అయితే అందుకు నేమ్, ఫేమ్ ఉండాలన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా విషయానికి వస్తే సిఫారసుల విషయంలో కథానాయకుల ప్రభావం చాలా ఉంటుంది. అయితే చాలా మంది ఈ విషయాన్ని ఒప్పుకోరు. ముఖ్యంగా కథానాయికల విషయంలో వారి జోక్యం ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. కోలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఎదిగిన నటుడు సంతానం ఇటీవల హీరోగా మారి వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన దిల్లుకు దుడ్డు చిత్రం కలెక్షన్ల పరంగా ఇరగదీసింది.
 
  సంతానం ఆరంభంలో హీరోగా నటించిన వల్లవనుక్కుమ్ పుల్లుమ్ ఆయుధం, ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాల్లో ఆయనకు జంటగా నటి ఆస్నా జవేరి నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. సంతానం.. నటి ఆస్నా జవేరికి సిఫారసులు చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అంతే కాదు ఆ చిత్రాల హీరోహీరోయిన్లు సంతానం, ఆస్నా జవేరిలపై వదంతులు వెల్లువెత్తాయి. దీంతో సంతానం తదుపరి చిత్రాల్లో ఆస్నా జవేరి కనిపించలేదు. సంతానం కావాలనే పక్కన పెట్టినట్లు గుసగుసలు వినిపించాయి.
 
 అయినా కోలీవుడ్‌ను వదిలి వెళ్లని ఉత్తరాది భామ ఆస్నా జవేరి ఇక్కడే మకాం వేసి అవకాశాల వేటలో పడ్డారు. అలా ఒక చిత్రం అవకాశాన్ని సంపాదించుకున్నారు కూడా. ప్రస్తుతం తను మీన్‌కుళంబుమ్ మనపాలైయం అనే చిత్రంలో కాళిదాస్ జయరాం సరసన నటిస్తున్నారు. అయితే కొత్త అవకాశాలేమీ రాకపోవడంతో మళ్లీ సంతానంను ఆశ్రయించి సిఫారసు చేయమని అడిగారట. ప్రస్తుతం విజయాల జోరులో ఉన్న సంతానం త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.
 
 ఇంకా కొన్ని కథలు వింటున్నారు. ఒక నూతన దర్శకుడి చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అంతే కాదు అందులో ఆయనకు జంటగా ఆస్నా జవేరిని సిఫారసు చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద మూడో సారి సంతానంతో జతకట్టడానికి ఆస్నాజవేరి రెడీ అవుతున్నారన్న మాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement