
అంచల్ సింగ్, సంతానం
సంతానం హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. అంచల్ సింగ్ కథానాయిక. రామ్‌బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాని శ్రీ కృష్ణా ఫిలింస్ బ్యానర్‌పై ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో నటరాజ్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ –‘‘గట్స్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చని చెబుతూ ఈ టైటిల్ పెట్టారు. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందినే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీ కృష్ణా ఫిలింస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment