dillukku duddu
-
దమ్ముందా?
ప్రముఖ హాస్యనటుడు సంతానం, అంచల్ సింగ్ జంటగా రూపొందిన చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. రామ్‌బాల దర్శకత్వంలో శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో నటరాజ్ ఈ నెల 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మాట్లాడుతూ– ‘‘హాస్యనటుడిగా అలరించిన సంతానం హీరోగానూ అలరిస్తున్నాడు. ఆయన గత సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీ కృష్ణా ఫిలింస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: దీపక్ కుమార్ పతి. -
దమ్ముంటే సొమ్మే
సంతానం హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. అంచల్ సింగ్ కథానాయిక. రామ్‌బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాని శ్రీ కృష్ణా ఫిలింస్ బ్యానర్‌పై ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో నటరాజ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ –‘‘గట్స్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చని చెబుతూ ఈ టైటిల్ పెట్టారు. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందినే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీ కృష్ణా ఫిలింస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి. -
సంతానంకు జంటగా వైభవి శాండిల్య
హాస్య నటుడి నుంచి కథానాయకుడి స్థాయికి ఎదిగిన నటుడు సంతానం. ఇప్పటి తన స్థాయిని నిలబెట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఈయన చిత్రాల ఎంపికలో ఆచీతూచీ అడుగేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సంతానం దిల్లుక్కు దుడ్డు, సర్వర్ సుందరం చిత్రాల్లో నటిస్తున్నారు. దిల్లుక్కుదుడ్డు చిత్రంలో తన ఆస్థాన హీరోయిన్గా ప్రచారంలో ఉన్న ఆస్నా జవేరి నటిస్తుండగా, సర్వర్‌సందరం చిత్రంలో మరాఠి బ్యూటీ వైభవి శాండిల్యను హీరోయిన్గా ఎంపిక చేశారు. కెనన్యా ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవి శాండిల్యను ఎంపిక చేయడం గురించి చిత్రం యూనిట్ పేర్కొంటూ మహారాష్ట్ర కోలీవుడ్‌కు చాలా మంది ప్రతిభావంతుల్ని అందించిందన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి తాజాగా పరిచయం అవుతున్న వైభవి శాండిల్య కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. మూడు నెలల అన్వేషణ ఫలం వైభవి శాండిల్య అని అన్నారు. ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు మంచే జరిగిందన్నారు. వైభవి సౌందర్యవతి మాత్రమే కాకుండా మంచి థియేటర్ ఆర్టిస్ట్ అని తెలిపారు. అంతేకాదు భరతనాట్యం, కథాకళి నృత్యాల్లో నైపుణ్యం పొందిన నటి అని చెప్పారు.అలాంటి నటిని సర్వర్ సుందరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామన్నారు. వైభవి శాండిల్యకు ఇక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.