Super Star Mahesh Babu In New Avatar Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu : మహేశ్‌ లేటేస్ట్‌ లుక్‌.. ఫోటో అదిరిందిగా

Published Sun, Aug 14 2022 11:51 AM | Last Updated on Sun, Aug 14 2022 2:29 PM

Super Star Mahesh Babu In New Avatar Photo Goes Viral - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లేటోస్ట్‌ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్‌ లుక్‌లో సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు మహేశ్‌. తాజాగా ఆయన ఓ స్టైలిష్‌ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 'LOVING THE NEW VIBE' అనే ట్యాగ్‌లైన్‌తో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం మహేశ్‌ షేర్‌ చేసిన ఈ ఫోటో సూపర్‌ కూల్‌గా ఉంది.

కాగా ఈ ఫోటోతో  #SSMB28 అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. SSMB28 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి హ్యాట్రిక్‌ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement