సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలె మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. అయితే రెండు, మూడు రోజుల నుంచి ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు పుకార్లు వస్తుండటంతో నిర్మాత నాగవంశీ ఈ వార్తలకి చెక్ పెట్టారు.
‘SSMB28’ సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎగ్జ్‌జైటింగ్ అప్‌డేట్స్ వస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
The second schedule of our most awaited action extravaganza #SSMB28 will begin soon. Many more exciting updates will be unveiled in upcoming days. Stay tuned!
— Naga Vamsi (@vamsi84) October 31, 2022
Comments
Please login to add a commentAdd a comment