
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార మరోసారి తన డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఇప్పటికే ఇంగ్లీష్ పాటలతో పాటు తన తండ్రి మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ పాటలకు చిందేసి హల్‌చల్ చేసిన సీతు పాప...తాజాగా అదే సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’కి తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. (చదవండి : సితార డాడీ కూతురు.. ఫోటో షేర్ చేసిన నమ్రత)
ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సితార డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార వేసిన స్టెప్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయ అని అనిపించావు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. కాగా, అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక, విజయశాంతి ముఖ్య పాత్రలు పోషించారు.
(చదవండి : మహేశ్ బాబు ఇంట బర్త్‌డే పండగ)
Comments
Please login to add a commentAdd a comment