మహేశ్‌బాబు, చిరంజీవి
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకకు చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. ‘మా ఆహ్వానాన్ని మన్నించి అతిథిగా వచ్చేందుకు అంగీకరించిన చిరంజీవిగారికి ధన్యవాదాలు’ అని మహేశ్‌బాబు పేర్కొన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment