
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా సక్సెస్ సాధిస్తూనే ఉన్నా... లుక్ పరంగా మాత్రం ప్రయోగాల చేయటం లేదన్న విమర్శ ఉంది. కథా కథనాలతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాలోనూ ఒకే విధంగా కనిపించటంపై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇటీవల వచ్చిన మహర్షి సినిమాలో కొత్తగా ట్రై చేసి భారీగా మార్పు మాత్రం కనిపించలేదు.
తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వురు ఫస్ట్‌లుక్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మిలటరీ మేజర్‌గా నటిస్తున్న మహేష్ రొటీన్ లుక్‌లోనే దర్శనమిచ్చాడు. గతంలో మిలటరీ ఆఫీసర్‌గా నటించిన అల్లు అర్జున్, పోలీస్ గా నటించిన రామ్‌చరణ్‌లు క్యారెక్టర్ కోసం చాలా మేకోవర్ అయ్యారు. మహేష్ మాత్రం అలాంటివేం లేకుండా తన రొటీన్ లుక్‌లోనే యూనీఫాంలో కనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్‌లు పడుతున్నాయి. మరి ఈ విమర్శలపై సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment