మహేశ్‌ అభిమానులకు నిరాశ | Mahesh Fans Disappointed In Machilipatnam | Sakshi
Sakshi News home page

మహేశ్‌ అభిమానులకు నిరాశ

Jan 5 2020 9:55 AM | Updated on Jan 5 2020 10:32 AM

Mahesh Fans Disappointed In Machilipatnam - Sakshi

మహేష్‌ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది

మచిలీపట్నం : సంక్రాంతి సంబురాల పేరిట మచిలీపట్నంలో నిర్వహించిన ఓ టీవీ షోకు వచ్చిన సినీ హీరో మహేష్‌బాబును చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. టీవీ షోలో పాల్గొనేందుకు మహేష్‌బాబు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు శనివారం సాయంత్రం చేరుకున్నారు. కానీ ఇదే సమయంలో వర్షం పడటంతో సంబరాల్లో పాల్గొనకుండానే ఆయన వెనుదిరిగారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికి వర్షం తగ్గింది. రాత్రికి యధావిధిగా టీవీ షో నిర్వహించారు.

కాగా, మహేష్‌ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగటంతో అధిక సంఖ్యలో అభిమానులు ఏజే కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ మహేష్‌ బాబు వెళ్లిపోయారని తెలియటంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కాగా, మహేశ్‌ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరగనుంది. ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement