సెన్సార్‌ పూర్తిచేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’సినిమా | Mahesh Babu 'Sarileru Nekevvaru' Movie Censor Completed - Sakshi
Sakshi News home page

సెన్సార్‌ పూర్తిచేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’

Published Thu, Jan 2 2020 8:15 PM | Last Updated on Fri, Jan 3 2020 1:51 PM

Mahesh Babu Sarileru Neekevvaru Telugu Movie Censor Completed - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. గురువారం సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ఎలాంటి సీన్లు కట్‌ చేయకుండా యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారని చిత్ర బృందం ప్రకటించింది. దాదాపు 160 నిమిషాల నిడివి గల ఈ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ అందరినీ ఆకట్టుకునేవిధంగా, మహేశ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు తెరకెక్కించారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా మహేశ్‌-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలవడం ఖామయని జోస్యం చెబుతున్నారు. 

మామూలుగానే మహేశ్‌ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ అంచనాలకు తోడు ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌లతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. అనిల్‌ సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.

చదవండి: 
‘డీజే దించుతాం.. సౌండ్‌ పెంచుతాం’ 
నెట్టింట్లో రచ్చరచ్చ.. దేవిశ్రీనా మజాకా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement