
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. సినిమా విడుదలకు సరిగ్గా ఆరు రోజుల ముందు అంటే జనవరి 5న ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ మేరకు ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment