
‘మహర్షి’తో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాను సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మహేశ్ బాబు అభిమానులకు దసరా కానుకగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.
కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మాస్ లుక్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకోవడంతో తెగ వైరల్‌గా మారుతోంది. కాగా, ప్రస్తుతం రిలీజ్ అయిన పోస్ట్‌ర్‌తో సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్టు సమాచారం. సుమారు దశాబ్ద కాలం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ‘సరి లేరు నీకెవ్వరు’ తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.