సరిలేరు సూపర్‌హిట్‌: థాంక్స్‌ చెప్పిన మహేశ్‌ | Sarileru Neekevvaru : Mahesh Babu Thanks Audience | Sakshi
Sakshi News home page

సరిలేరు సూపర్‌హిట్‌: థాంక్స్‌ చెప్పిన మహేశ్‌

Published Mon, Jan 13 2020 1:14 PM | Last Updated on Mon, Jan 13 2020 4:21 PM

Sarileru Neekevvaru : Mahesh Babu Thanks Audience - Sakshi

సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతుండటంతో.. ఆ సినిమా హీరో మహేశ్‌బాబు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు సినిమాకు బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌ ఇచ్చారు. అందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’ అంటూ ట్వీట్‌ చేసిన మహేశ్‌.. అభిమానులతో ట్విటర్‌లో క్వశ్చన్‌-అన్వర్‌ సెషన్‌ కోసం ఎదురుచూస్తున్నానని, తనను ప్రశ్నలు అడగాలని కోరారు. ఇక, మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’  బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో చిత్రయూనిట్‌ రోజుకొక ప్రొమో, ప్రమోషన్‌ వీడియోలతో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ‘బ్లాక్‌బస్టర్‌కా బాప్‌’ చిత్రయూనిట్‌ ప్రొమో వీడియోలను విడుదల చేసింది. 

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాల మధ్య విడుదలైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement