మూడు రోజుల్లో స్టెప్‌ ఇన్‌ | Vijayashanthi Role In Sarileru Neekevvaru | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో స్టెప్‌ ఇన్‌

Aug 6 2019 2:33 AM | Updated on Aug 6 2019 2:33 AM

Vijayashanthi Role In Sarileru Neekevvaru - Sakshi

విజయశాంతి

పదమూడేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ స్క్రీన్‌ మీద కనిపించనున్నారు విజయశాంతి. మరో మూడు రోజుల్లో కెమెరా ముందుకు రాబోతున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆగస్ట్‌ 9 నుంచి విజయశాంతి చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది.

9 నుంచి ఓ వారంపాటు షూటింగ్‌లో పాల్గొంటారట. ఆ తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకొని మళ్లీ జాయిన్‌ అవుతారు. ఈ సినిమా కోసం సుమారు 55 రోజులు డేట్స్‌ను కేటాయించారట విజయశాంతి. దీన్ని బట్టి ఆమె పాత్ర ఈ సినిమాలో ఎంత కీలకంగా ఉండబోతోందో ఊహించవచ్చు. మహేశ్‌బాబుతో పాటు సాగే పాత్రలో విజయశాంతి కనిపిస్తారని సమాచారం. ఈ పాత్ర కోసం విజయశాంతి ఫిట్‌గా మారిపోయారు కూడా. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement