
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. గత మూడు సోమవారాలు మూడు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం (డిసెంబర్ 23) మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు.
సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌గా విడుదలైన ఈ పాట ఆర్మీ జవానుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఉంది. సైనికుల విలువలను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట ప్రతి ఒక్కరి మనసును కదిలించేదిగా ఉంది. ‘భగభగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటునే దూకేవాడె సైనికుడు’ అంటు సాగే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. ఈ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ యూరప్ వెళ్లి అక్కడి కళాకారులతో కంపోజ్ చేశాడు. ఎంతో అత్యద్భుతంగా సాగిన ఈ పాట యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment