మహేశ్‌ పాటకు చంపేశావ్‌ పో.. | Watch: David Warner Praises Wife Candice Dance For Mahesh Movie Song | Sakshi
Sakshi News home page

మహేశ్‌ పాటకు చంపేశావ్‌ పో..

Published Sun, May 31 2020 4:01 PM | Last Updated on Thu, Mar 21 2024 8:42 PM

క్రికెటర్‌గా బిజీ బిజీగా ఉండే ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ తీరిక లేకుండా గడుపుతున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న వార్నర్‌ తెలుగు సూపర్‌ హిట్‌ సినిమా పాటలకు భార్యతో కలిసి టిక్‌టాక్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. వారు చేసిన టిక్‌టాక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌​ కూడా అవుతున్నాయి. తాజాగా ఈ దంపతులు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ పాటకు స్టెప్పులేశారు.

దాదాపు 50 టేక్‌ల అనంతరం తాము సక్సెస్‌ అయ్యామని ట్విటర్‌లో ఆ వీడియోను శనివారం షేర్‌ చేశాడు. అయితే, వార్నర్‌ దంపతులు అదే పాటకు ఆదివారం కూడా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా.. తన భార్య కాండిస్‌ మాదిరిగా తాను డ్యాన్స్‌ చేయలేకపోయానని వార్నర్‌ చెప్పుకొచ్చాడు. మైండ్‌ బ్లాక్‌ పార్ట్‌-2 లో ఆమె డ్యాన్స్‌ ఇరగదీసిందని మెచ్చుకున్నాడు. దీనికి మూడో పార్ట్‌ కూడా ఉంటుందని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement