
లొకేషన్‌లో..విజయశాంతి
విజయశాంతి సినిమాలకు బ్రేక్ ఇచ్చి 13 ఏళ్లయింది. ఇప్పుడు ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు.. అద్దం ముందు నిల్చుని డైలాగ్ పేపర్ చెక్ చేసుకుంటున్నారు. యాక్షన్, కట్ పదాల మధ్యలో మళ్లీ తన యాక్టింగ్ స్కిల్‌ని ఆడియన్స్‌కి చూపించడానికి రెడీ అయ్యారు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనీల్ సుంకర, ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. సోమవారం షూటింగ్‌లో జాయిన్ అయ్యారామె. ‘‘అదే క్రమశిక్షణ, అదే డైనమిజం, అదే యాటిట్యూడ్. 13 ఏళ్లలో విజయశాంతిగారు ఏం మారలేదు’’ అన్నారు అనిల్ రావిపూడి. కాగా విజయశాంతిది మహేశ్‌తో సమానంగా సాగే పాత్ర అని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment