అది ఐటమ్‌ సాంగ్‌ కాదు : మహేశ్‌బాబు | Mahesh Babu Says Daang Daang Is Not A Item Song | Sakshi
Sakshi News home page

అది ఐటమ్‌ సాంగ్‌ కాదు : మహేశ్‌బాబు

Published Mon, Dec 30 2019 1:51 PM | Last Updated on Mon, Dec 30 2019 1:53 PM

Mahesh Babu Says Daang Daang Is Not A Item Song - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్‌లోని ప్రతి సోమవారం ఈ చిత్రంలోని ఒక్కో పాట విడుదల చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చివరి పాట ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌ వీడియో ప్రోమోను విశాఖ ఉత్సవ్‌ వేదికగా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో మహేశ్‌, తమన్నాల డ్యాన్స్‌ హైలెట్‌గా నిలిచింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

అయితే ఈ వీడియోపై మహేశ్‌ స్పందిస్తూ.. ‘మా డైరక్టర్‌ చెప్పినట్టు ఇది ఐటమ్‌ సాంగ్‌ కాదు.. ఇది పార్టీ సాంగ్‌’ అని మహేశ్‌ పేర్కొన్నారు. ఎప్పటిలాగే దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన మ్యూజిక్‌ అందించారని పేర్కొన్నారు. ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి చాలా రోజుల తరువాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా రాబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement