లేడీ అమితాబ్‌ ‘కిక్‌’ మాములుగా లేదుగా.. | Vijayashanthi Master Kick Video | Sakshi
Sakshi News home page

లేడీ అమితాబ్‌ ‘కిక్‌’ మాములుగా లేదుగా..

Published Tue, Jan 14 2020 2:25 PM | Last Updated on Tue, Jan 14 2020 2:32 PM

Vijayashanthi Master Kick Video - Sakshi

దాదాపు పదమూడేళ్ల తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు లేడీ అమితాబ్‌ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో పవర్‌ఫుల్‌ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రొఫెసర్‌ భారతిగా అభిమానులను అలరించారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంగా విజయశాంతి చేసిన ఓ ఫీట్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆమె బ్రహ్మాజికి కిక్‌ ఇస్తున్న.. స్లో మోషన్‌ వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నారు. దానిని మాస్టర్‌ కిక్‌ అని పేర్కొన్నారు. అలాగే అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై బ్రహ్మాజీ స్పందిస్తూ ‘కిక్‌ ఎవరికీ’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనిల్‌ పోస్ట్‌పై నెటిజన్లు ‘వావ్‌ సూపర్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

సంక్రాంతి కానుకగా విడుదలైన జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. 

చదవండి : సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ

రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement