సరిలేరు మీకెవ్వరు | sarileru neekevvaru song launch | Sakshi
Sakshi News home page

సరిలేరు మీకెవ్వరు

Published Fri, Aug 16 2019 12:24 AM | Last Updated on Fri, Aug 16 2019 4:48 AM

sarileru neekevvaru song launch - Sakshi

మహేశ్‌బాబు

‘నిప్పుల వర్షమొచ్చినా జనగణమణ అంటూ దూకేవాడే సైనికుడు. మంచు తుఫాను వచ్చినా వెనకడుగు లేదంటూ దాటేవాడే సైనికుడు...’ అంటూ దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సైనికులను ‘సరిలేరు మీకెవ్వరు’ అంటోంది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు సైనికుడి పాత్ర చేస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలో ‘నిప్పుల వర్షమొచ్చినా....’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. విజయశాంతి, సంగీత ముఖ్య పాత్రలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement