indipendenceday
-
AP: స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం
విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరుగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శిస్తారు. రేపు సాయంత్రం 5:30నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం జరుగనుంది.ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విద్యుత్ వెలుగులతో ముస్తాబయిన ఏపీ సీఎం జగన్ కార్యాలయం
-
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రసంగం
-
పంద్రాగస్టును టార్గెట్ చేసిన పాక్ ఉగ్ర సంస్థలు
-
కనుల పండువ... స్వాతంత్య్ర వేడుక...
జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వీధి వీధినా... స్వాతంత్య్రవేడుకలు అత్యంత ఉత్సాహవంతంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానంలో కనుల పండువగా సాగిన ఉత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పతాకావిష్కరణ గావించారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు... నాయకులు హాజరైన ఈ ఉత్సవంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు అలరించాయి. విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 73వ స్వాతంత్య్ర వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్, జిల్లా పోలీసు సూపరిండెంట్ రాజకుమారితో కలిసి సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసే శకటాలను తిలకించి, స్టాల్స్‌ను సందర్శించి పేదలకు ఆస్తులు పంపిణీ చేశారు. పతాకావిష్కరణతో ఉత్సవాలు ప్రారంభం.. పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 9గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఆమెకు పోలీసులు, ఇతర రక్షకభటులు గౌరవ వందనం చేశారు. అనంతరం శాంతికి సూచికగా పావురాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మూడు నెలల్లో చేసిన కార్యక్రమాలు, రానున్న ఏడాది కాలంలో చేపట్టే కార్యక్రమాల గురించి ఆమె సుదీర్ఘంగా ప్రసంగించారు. పనితీరుకు ప్రశంస.. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థలకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన వారికి ఉప ముఖ్యమంత్రి వాటిని అందజేశారు. జిల్లాలో 87 శాఖలు, వివిధ విభాగాలకు చెందిన 430మంది ప్రశంసా పత్రాలు అందికున్నవారిలో ఉన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో మంచి ప్రగతి కనపరిచిన వారికి, పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా చేసిన వారికి, వివిధ శాఖల్లో విధుల్లో మంచి పనితీరు కనపరిచిన వారికి ఈ ప్రశంస దక్కింది. అదరహో అనిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎనిమిది పాఠశాలలకు చెందిన పిల్లలు దేశభక్తి పెంపొందించే గీతాలకు నృత్య ప్రదర్శన చేశారు. ఎవరికి వారే పోటీ, ఎవరికి వారే సాటి అన్న రీతిలో సాగిన ప్రదర్శనలు ఆహూతులను అలరించా యి. భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలు, స్వా తంత్య్ర సమరయోధుల పోరాటం, దేశ గొప్పతనం, ప్రజాస్వామ్యం విశిష్టత చాటిచెబుతూ రచించిన గే యాలకు విద్యార్థులు చూడ ముచ్చటగా నృత్యాలను ప్రదర్శించడం విశేషం. ముందుగా వివిధ పాఠశాల విద్యార్థుల మాస్ డ్రిల్‌తో కార్యక్రమం మొదలైంది. తర్వాత విజయనగరం గరŠల్స్ హైస్కూల్ విద్యార్థినులు వందేమాతరం గేయానికి స్థానికంగా ప్రాచుర్యం పొందిన కర్ర, కత్తి సాములు జోడించి ప్రదర్శన ఇచ్చారు. ఫోర్ట్ సిటీ విద్యార్థులు ఐ యామ్ ఇండియన్ గేయానికి, కేజీబీవీ విద్యార్థినులు ఒకే ఒక్క ఓంకారం అన్న గీతానికి, సెయింట్ మేరీస్ విద్యార్థులు దేశభక్తి గీతానికి, ద్వారకా తిరుమల అంధుల పాఠశాల విద్యార్థులు మేరా భారత్, జిల్లా పోలీసు వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు మేమే ఇండియన్స్, కొత్తవలస ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు పుణ్యభూమి ఈ భరతదేశం, బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇండియా వాలా గేయాలకు నృత్య ప్రదర్శన అందించారు. ఇందులో ద్వారకామయి అంధుల పాఠశాల విద్యార్థులు, ఏపీ మోడ ల్ స్కూల్ విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థుల ప్రదర్శనలకు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక బహుమతి గెల్చుకున్నారు. రూ.336.86కోట్ల ఆస్తులు పంపిణీ.. ఉత్సవంలో భాగంగా పేదలకు రుణాలు, ఆస్తులు పంపిణీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, కలెక్టర్ హరి జవహర్లాల్, ఎస్పీ రాజకుమారి తదితరులు వాటిని అందజేశారు. మైదానంలో మొత్తం 18శాఖలు తమ ప్రగతిని, పథకాలను తెలియజేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇందులో ఆరుశాఖలు పేదల కు రూ.336.85కోట్ల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశా యి. డీఆర్డీఏ–వెలుగు అధికారులు 8642 సంఘాల కు రూ.298.55కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 4087 మందికి రూ.19.47కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేశారు. వైఎస్సార్ బీమా కింద 456 మందికి రూ.8.36కోట్లు సాయం అందజేశారు.252 రైతు సంఘాలకు రూ.1.26 కోట్లు రుణాలు ఇప్పించారు. విభిన్న ప్రతిభావంతులశాఖ ద్వారా 8మందికి రూ.50వేలు వంతున, బీసీ కార్పొరేషన్ ద్వారా 34మందికి రూ.41.04కోట్లు, కెనరాబ్యాంకు, డీసీసీబీ 9మందికి రూ.15లక్షలు, డీపీవో ద్వారా 2289మందికి రూ.4.65కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 68మందికి రూ.2కోట్లు విలువ గల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో జె.వెంకటరావు, విజయనగరం ఆర్డీవో జె.వి.మురళి, ఇతర అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మజ్జిశ్రీనివాసరావు, పెనుమత్స సురేష్‌బాబు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. -
ప్రగతి వైపు అడుగులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లా కేంద్రం లోని పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం 73వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించా రు. ‘స్పందన’ ద్వారా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు. ఇ ప్పటివరకు 13,201 అర్జీల్లో 11,062 అర్జీ లు పరిష్కరించారని తెలిపారు. ఇటీవల వచ్చిన వంశధార, నాగావళి వరదల్లో ప్రకృతి విపత్తును కూడా సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ప్రజలకు పారదర్శకంగా అందించడానికి వలంటీర్ల వ్యవస్థకు రూపకల్ప న చేశామని తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని, ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.40 హెక్టార్లలో పంట వేయడానికి ప్రణాళిక వేసినట్లు వివరించారు. జలాశయాల అభివృద్ధికి ని ర్ణయాలతో పాటు రైతులకు విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపా రు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అక్టోబర్ నుంచి రైతు భరోసా.. అక్టోబర్ నుంచి రైతు భరోసా మొదలవుతుందని, ఈ పథకం ద్వారా రైతుకు రూ.12, 500 అందుతుందని తెలిపారు. రానున్న నాలు గేళ్లలో దాదాపు 3,29,000 రైతు కుటుంబాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే ఇరవై వేల మంది కౌలు రైతులకు కూడా భరోసా కల్పించినట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో రూ.2,171 కోట్ల పంట రుణాలు, రూ. 1030 కోట్ల టెర్మ్ రుణాలు అం దించడానికి లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. ఉద్యాన పంటల అభివృద్ధి, బిందు, తుంపర సేద్యాలపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. పాడి రైతులకు దాణా అందించేందుకు 2612 ఎకరాల్లో మేలురకం పశుగ్రాసం పెంచుతున్నామని తెలిపారు. జల వనరుల అభివృద్ధి కింద వంశధార, మహేంద్ర తనయ పనుల కోసం రూ.1536 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు 2020కి పూర్తవుతుందని చెప్పారు. తాగునీటి కోసం ఇప్పటి వరకు రూ.305.51 కోట్లు ఖర్చు చేశామన్నారు. వంశధార ఎడమకాలువకు రూ.543 కోట్లు, నారాయణపురం ఆనకట్టకు జైకా నిధులు రూ.112 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆరోగ్య శ్రీకి ప్రాధాన్యత.. ఆరోగ్య శ్రీ సేవలకు ప్రాధాన్యమిస్తున్నామని, మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రుల పునరుద్ధరణకు రూ.4.70 కోట్లు కేటాయించామని, రూ.2.27 కోట్లతో కొత్త భవనాలు కడుతున్నామని చెప్పారు. రిమ్స్ వార్డులను సీఆర్ఎస్ కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు.వెయ్యి రూపాయల ఖర్చు దాటిన వైద్యాన్ని వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్యక్రమం ద్వారా చేస్తామన్నారు. విద్యపై కూడా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 161 డిజటల్ క్లాస్‌లు, 284 పాఠశాలల్లో వెర్టికల్ తరగతులు మం జూరు చేసినట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీ తరగతుల నిర్వహణ, మెరుగైన వసతి కోసం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జగనన్న అమ్మ ఒడి అమలులోకి వస్తుందన్నారు. తాగునీటికి ప్రత్యేక ప్రణాళిక.. తాగునీటి వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, కిడ్నీ ప్రభావిత ప్రాంతా ల్లో ఏడు ఆర్వో ప్లాంటులు, గిరిజన ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైఎస్సార్ ఆసరా ద్వారా ఆదుకుంటున్నామని వివరించారు. నవరత్నాల్లోని ఓ భాగమైన ఈ పథకం ద్వారా 2019 ఏప్రిల్ 11 నాటికి చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని మహిళా సంఘాలకు నాలుగు విడతల్లో చెల్లిస్తామని, అందుకు రూ.1385.61 కోట్లు 48,171 సంఘాలకు అందజేయనున్నామని అన్నారు. నాంది కార్యక్రమం ద్వారా న్యూట్రిన్ బిస్కెట్లు, నువ్వుల ఉండలు వంటి వాటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ.. జిల్లాలోని నిరుపేదలైన లక్ష కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఉగాది నాటికి కార్యక్రమం జరుగుతుందని దాసన్న అన్నారు. తిత్లీలో నిరాశ్రయులైన 10,767 కుటుంబాలకు వైఎ స్సార్ గృహనిర్మాణ పథకం ద్వారా 269.18 కోట్లతో ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ఉపాధి లోనూ జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు గాను 114 ఎంఎస్ఎంఈలు రూ. 49 కోట్లతో స్థాపించి, 1160 మందికి ఉపాధి కల్పించామని అన్నారు. నవరత్నాలను అమలు చేస్తున్నామని, కిడ్నీ బాధితులకు పింఛన్ మొత్తం పెంచామని గుర్తు చేశారు. దశల వారీ గా పింఛను మొత్తం పెంచుకుంటూ పోతామని, 60 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛను అందిం చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపా రు. భవనాలు, రహదారుల అభివృద్ధికి రూ. 860 కోట్లు కేటాయించామని తెలిపారు. పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. పంచా యతీ రాజ్ విబాగం ద్వారా రూ.56.65 కోట్లతో 19 రహదారులకు టెండర్లు పిలిచామని తెలిపా రు. 436 అంగన్వాడీ భవనాలు ఎన్ఆర్ఈజీ ఎస్ నిధులలో నిర్మిస్తున్నామన్నారు. రైతులకు పగటి పూట నాణ్యంగా 9 గంటల పాటు విద్యు త్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. టూరిజంలో వేగం.. ప్రగతి కార్యక్రమాలతోపాటు టూరిజంను కూ డా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అన్నారు. టెంపుల్ టూరిజం, కళింగపట్నం, శివసాగర్ బీచ్, జగతిపల్లి రిసార్ట్సు, గిరిజన మ్యూజియం, దేవాలయాలు మాస్టర్ ప్లాన్ రూపొందించనట్లు చెప్పారు. అలాగే జిల్లాలో 1.20 కోట్ల మొక్కలు నాటుతున్నామని, హరిత వాతావరణం తీసుకువస్తామని చెప్పారు. క్రీడలకు ప్రాధాన్యత, జాబ్‌మేళాల నిర్వహణలోనూ ముందంజలో ఉన్నామని సోదాహరణంగా వివరించారు. ప్రజల సంతృప్త స్థాయిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతకుముందు ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ దళాల గౌరవ వంద నం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఆయనతో పాటుగా కలెక్టర్ జె.నివాస్, ఏఎస్పీ అమ్మిరెడ్డి, ఐటీడీఏ పీవో సీ ఎం సాయికాంత్ వర్మ, ట్రైనీ కలెక్టర్ భరత్‌తేజ, జేసీ పి.రజనీకాంతారావు, డీఆర్ఓ కె.నరేంద్ర ప్రసాద్, ఆర్డీఓ ఎంవీ రమణ, వైఎస్సార్సీపీ ఎంపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, ధర్మాన పద్మప్రియ, డ్వామా పీడీ హెచ్ కూర్మారావు, డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణ చర్రవర్తి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. క్రికెటర్ వెంకటేశ్వరరావుకు గౌరవం.. వజ్రపుకొత్తూరు: ఉద్దానం రామకృష్ణాపురానికి చెందిన అంధ క్రికెటర్ దున్న వెంకటేశ్వరరావుకు ప్రతిభకు తగ్గ గౌరవం దక్కింది. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాంతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెంకటేశ్వరరావును అవార్డుతో అభినందించారు. రెండేళ్లుగా భారత జట్టు విజయాల్లో వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర జిల్లా అధికారులు క్రికెటర్ వెంకటేశ్వరరావును అభినందించారు. దీనిపై ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు చింత జనార్ధనరావు, చింత హేమారావు, దున్న కృష్ణారావు తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. -
స్వరాజ్య సంబరం..ఇదిగో సురాజ్యం
పంద్రాగస్టు వేళ పల్లెలు, పట్టణాలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. త్రివర్ణపతాకం సాక్షిగా సురాజ్యం మొదలైంది. జనహితమే అభిమతంగా.. నవశకమే ధ్యేయంగా ఇచ్చిన మాట ప్రకారం గ్రామ/వార్డు వలంటీర్ వ్యవస్థకు సర్కారు శ్రీకారం చుట్టింది. సచివాలయ వ్యవస్థ దిశగా తొలి అడుగు పడింది. ప్రగతి పథంలో విశాఖ రథాన్ని పరుగులెత్తించడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం ఘనంగా నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్, విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వెంటరాగా జాతీయ జెండాను ఎగురువేశారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తన సందేశాన్ని వినిపించారు. ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాక్షి, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ఉన్నత లక్ష్యాల సాధనకే నవరత్నాలైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం ఘనంగా నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్, విశాఖ నగర పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా వెంటరాగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి తన సందేశాన్ని వినిపించారు. ‘నవరత్నాల’ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సమర్థవంతమైన, అవినీతి రహిత పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి నిర్దేశించిన విధంగా గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటిల్లో పనిచేయడానికి కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే నవరత్నాలు పారదర్శకంగా అందేలా చూడటానికి, అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ప్రజల ముంగిట ఉంచేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మోపిదేవి ప్రసంగంలో ముఖ్యాంశాలు -జిల్లాలోని 325 గ్రాయ పంచాయతీల్లో 739 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. -వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం. -వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే పంటల బీమా, అలాగే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం నాలుగేళ్ల కాలానికి రూ.50 వేలు ప్రభుత్వం ఇస్తుంది. -రెతులకు వడ్డీలేని పంటరుణాలు, ఉచితంగా బోరు, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. -రైతు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం ప్రభుత్వం అందజేస్తుంది. -ప్రతి నియోజకవర్గంలో పంటల నిల్వ కోసం శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. -ఈ ఖరీఫ్‌లో రూ.18 కోట్ల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందజేయాలనేది లక్ష్యం. -జనని శిశు సురక్ష కార్యక్రమం ద్వారా బాలింతలకు ఉచితంగా రవాణా, భోజనం సౌకర్యాల కల్పన. మందులు, వైద్య పరీక్షలు, రక్తం, అవసరమైతే సిజేరియన్ తదితర వైద్యసేవలు అందిస్తున్నాం. -వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో రూ.108.42 కోట్ల వ్యయంతో 43 వేల మందికి వివిధ రకాల శస్త్రచికిత్సలు జరిగాయి. జిల్లాలో 65 కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు జరుగుతోంది. -ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అత్యాధునిక వైద్యసేవలు అందించడానికి వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజీ మంజూరు. -అర్హులైన ప్రతి కుటుంబానికి వైఎస్సార్ గృహనిర్మాణ పథకం కింద పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్ష పట్టాలు, పట్టణాల్లో 2 లక్షల పట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. -గ్రామాల్లో తాగునీరు అందజేసేందుకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ గ్రాంట్ రూ.57 కోట్లతో 758 మంచినీటి పథకాలు మంజూరయ్యాయి. -దేశంలోనే ఎక్కువగా వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసిన జిల్లాగా మన విశాఖ నిలిచింది. -జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధికల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. -రూ.65 వేల కోట్ల పెట్టుబడితో రానున్న హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, రుషేల్ డీకాక్స్ వంటి 51 భారీ తరహా పరిశ్రమల ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. -విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక నడవ (వీసీఐసీ) కోసం 6,800 ఎకరాల ల్యాండ్ బ్యాంకు సిద్ధమైంది. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -నూతన ఎం–పార్కు విధానం ద్వారా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామికవాడలు స్థాపించే లక్ష్యంతో 15 పార్కులు గుర్తించడమైంది. -ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ‘అరకు ఎకో టూరిజం సర్క్యూట్’ ఏర్పాటు కోసం రూ.156 కోట్లతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. -మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగి, స్మారక స్థలం కృష్ణదేవిపేటలో పర్యాటక అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేసింది. -పింఛన్ల పెంపు ద్వారా జిల్లాలోని 4.16 లక్షల మందికి మేలు జరిగింది. -వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా జిల్లాలోని 43వేల స్వయంసహాయక (డ్వాక్రా) సంఘాలకు ఏప్రిల్ వరకూ ఉన్న రూ.1,892 కోట్ల బ్యాంకు అప్పులను నాలుగు వాయిదాల్లో మాఫీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -బ్యాంకు లింకేజీ ద్వారా గత నెల వరకూ 8,297 డ్వాక్రా సంఘాలకు రూ.159.17 కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయి. -వైఎస్సార్ బీమా పథకం కింద జిల్లాలోని 19.14 లక్షల మందిని అసంఘటిత కార్మికులుగా గుర్తించారు. -గ్రామాల నుంచి వలసలను నివారించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2.24 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యంగా చేసుకున్నాం. -స్మార్ట్ విశాఖగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.1602 కోట్ల అంచనా వ్యయంతో ఐదేళ్ల కాలవ్యవధిలో అమలు చేయడానికి కార్యాచరణ ఉంది. -స్వచ్ఛ విశాఖ సాధనకు నగర ప్రజలు సహకరించాలి. -గిరిజనుల ఆరోగ్యం, విద్య, ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. -క్రీడా కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారీగా నిధులతో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి, మౌలిక వసతుల కల్ప నకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆస్తుల పంపిణీ.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆస్తుల పంపిణీ జరిగింది. మొత్తం రూ.192.36 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో డీఆర్డీఏ నుంచి 8,297 గ్రూపులకు 159.16 కోట్లు, బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి కింద 1992 గ్రూపులకు రూ.24.28 కోట్లు, ఏపీఆర్‌ఐజీపీ కింద 1365 రైతులకు 1.09 కోట్లు, బీసీ కార్పొరేషన్ నుంచి 30 మంది లబ్ధిదారులకు రూ.21 లక్షలు, ఎస్పీ కార్పొరేషన్ నుంచి 106 మంది లబ్ధిదారులకు రూ.7.57 కోట్లు, 80 మంది విభిన్న ప్రతిభావంతులకు 15 ట్రైసైకిల్స్ , 20 వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, తదితర ఆస్తులను పంపిణీ చేశారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా పలువురికి ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాస్, విశాఖñ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, జీసీసీ ఎండీ టి.బాబురావునాయుడు, జాయింట్ కలెక్టర్ టి.శివశంకర్, ట్రైనీ కలెక్టర్ ప్రతిష్ట, డీఆర్వో ఎం.శ్రీదేవి, ఏవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్,³ పద్మశ్రీ కూటికుప్పల సూర్యరావు, వైఎస్సార్సీపీ నాయకులు కె.ప్రసాద్‌రెడ్డి, రొంగలి జగన్నథం, పక్కి దివాకర్ పాల్గొన్నారు -
సరిలేరు మీకెవ్వరు
‘నిప్పుల వర్షమొచ్చినా జనగణమణ అంటూ దూకేవాడే సైనికుడు. మంచు తుఫాను వచ్చినా వెనకడుగు లేదంటూ దాటేవాడే సైనికుడు...’ అంటూ దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సైనికులను ‘సరిలేరు మీకెవ్వరు’ అంటోంది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు సైనికుడి పాత్ర చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలో ‘నిప్పుల వర్షమొచ్చినా....’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. విజయశాంతి, సంగీత ముఖ్య పాత్రలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. -
జయహో
-
జెండా వందనంలోనూ పచ్చపాతం
సాక్షి, రాజమహేంద్రవరం : సర్పంచులను కాదని ఎంపీటీసీలతో జెండాను ఎగురవేయాలన్న నిర్ణయం అమలులో జిల్లాలోని టీడీపీ నేతలు వివక్ష చూపించారు. పంచాయతీ సర్పంచులకు బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రాథమిక పాఠశాలల్లో ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జెడ్పీటీసీలు జెండా వందనం చేయాలని ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో మాత్రం ‘పచ్చ’పాతం చూపించింది. జిల్లాలో టీడీపీ ఎంపీటీసీలు ఉన్న చోట మాత్రం ప్రభుత్వ నిర్ణయం అమలుకాగా వైఎస్సార్సీపీ సభ్యులున్న దగ్గర పలుచోట్ల టీడీపీ సర్పంచులు, ఇతర నేతలు జాతీయ జెండా ఎగురవేశారు. దేవాలయాల్లాంటి పాఠశాలల్లో అధికార పక్ష సభ్యులు పిల్లల సాక్షిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ విపక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సోమవారం 70వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని బలభద్రపురం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు జి.సత్యవతిని ఒక రోజు ముందుగానే ఉపాధ్యాయులు ఆహ్వానించారు. అయితే జెండా వందనం మాత్రం స్థానిక సర్పంచి సీహెచ్ వీరభద్రం చేశారు. దీనిపై ఎంపీటీసీ జి.సత్యవతి ఉపాధ్యాయులను నిలదీశారు. తాము మాత్రం ఏమి చేయగలమని నిస్సహాయత వ్యక్తం చేశారు. రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పాఠశాలలో స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీటీసీ చలమల్ల వరలక్ష్మిని కాదని మండల కోఆప్షన్ సభ్యుడితో జెండా ఎగురవేయడానికి టీడీపీనేతలు ప్రయత్నించారు. చివరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ముగించారు. రాజానగరం మండలం జెడ్పీటీసీ అత్యుత్సాహం వల్ల పలు పాఠశాలల్లో స్వాతం త్య దినోత్సవ వేడుకలు మధ్యాహ్నం వర కు జరిగాయి. మండలంలో ఉన్న14 ఉన్నతపాఠశాలల్లో తానే జెండా ఎగుర వేయాలని నిర్ణయించుకున్న జెడ్పీటీసీ పల్లం రత్నం ఆమేరకు పాఠశాలలకు సమాచా రం పంపారు. ఫలితంగా జెడ్పీటీసీ వచ్చే వరకు ఎర్రటి ఎండలో పిల్లలు, ఉపాధ్యాయులు నిలబడాల్సి వచ్చింది. మొత్తం మీద 11చోట్ల జెండా వందనంలో పాల్గొ న్న ఆయన మరో మూడు చోట్ల మాత్రం టీడీపీ నేతలు జెండా ఆవిష్కరణ చేశారు. తుని నియోజకవర్గం తొండంగి మం డలం శృంగవృక్షం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ)దార్ల లక్ష్మి హాజరయ్యారు. అయితే ఎంపీటీసీకి బదులుగా పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ జాతీయ జెండా ఎగురవేశారు. ఉపాధ్యాయుల తీరుపై దార్ల లక్ష్మి మండల విద్యాశాకాధికారికి ఫిర్యాదు చేశారు. -
సమగ్ర అభివృద్ధికి కృషి
సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ సిటీ: దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు, సత్వర రాష్ట్రాభివృద్ధికి ప్రజలంతా సమష్టిగా పునరంకితం అవుదామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోలీస్ పేరేడ్ మైదానంలో 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, ఎన్సీసీ దళాలు నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరించి మార్చ్ఫాస్ట్ను తిలకించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను అందించిన మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. రెండంకెల రేటు అభివృద్ధి సాధన లక్ష్యంగా... జిల్లాలో ఈ సంవత్సరం రైతులకు రూ.6,800 కోట్లు పంట రుణాలుగా అందిస్తున్నామని, రెండంకెల రేటు అభివృద్ధి సాధన లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు పలు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యానవన రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేసిన రుణమాఫీ పథకం కింద జిల్లాలో 2,228 మంది రైతులకు రూ.38.75 కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఈ ఏడాది రూ.1,346 కోట్లు రుణాలు మహిళా గ్రూపులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా జిల్లాలో 4,74,975 మంది పేదలకు ప్రతి నెలా రూ.51 కోట్ల మొత్తాన్ని సామాజిక భద్రతా పింఛన్లుగా అందిస్తున్నామన్నారు. రూ.473 కోట్ల వ్యయంతో 21 వేల గృహాలు... ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.473 కోట్ల వ్యయంతో 21 వేల గృహాలు బడుగు వర్గాల కోసం నిర్మాణం చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.237 కోట్ల వ్యయంతో 3 లక్షల 40 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, పంట కుంటలు, పేదల భూముల్లో ఎన్టీఆర్ జలసిరి బోర్లు వంటి ఆస్తుల అభివృద్ధి చేశామన్నారు. జిల్లాలో 15,30,370 పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించామని, లక్షా 82వేల పేద కుటుంబాలకు దీపం వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మాతా శిశు సంజీవిని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, అన్న దీవెన తదితర కార్యక్రమాలతో మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వివిధ సామాజక వర్గాల సంక్షేమం కోసం ఈ ఏడాది చేట్టిన కార్యాచరణలో భాగంగా ఈ సంవత్సరం కాపు కార్పొరేషన్ ద్వారా రూ.150 కోట్ల సబ్సిడీతో 15వేల మంది లబ్ధిదారులకు రూ.300 కోట్ల విలువైన యూనిట్లు అందిస్తున్నామన్నారు. ప్రజలందరి సహకారంతో జిల్లా ప్రగతి పధంలో మరింత ముందుకు సాగాలని మంత్రి తన ప్రసంగంలో ఆకాంక్షిచారు. వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుడు చోడిపల్లి హనుమంతరావును మంత్రి సత్కరించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన జిల్లా గిరిజన సాహస యువకుడు దూబి భద్రయ్యను మంత్రి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు సహాయల పంపిణీ... వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలు పథకాల సమాచారం, ఎగ్జిబిట్లతో స్టాళ్ళను ఏర్పాటు చేశాయి. వివిధ శాఖల ద్వారా మంజూరు చేసిన వస్తుసముదాయాన్ని లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఇందులో భాగంగా డీఆర్డీఏ ద్వారా 1680 గ్రూపులకు రూ.75.60 కోట్ల బ్యాంకు రుణాల లింకేజీ, 1691 మంది మహిళలకు రూ. 20 కోట్ల 11 లక్షలు స్త్రీనిధి రుణాలు, మెప్మా ద్వారా 1112 గ్రూపులకు రూ.50 కోట్ల 3లక్షలు బ్యాంకు రుణాల లింకేజీని లబ్ధిదారులకు అందించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.31 లక్షలు విలువైన 18 యూనిట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.35 లక్షల 50వేల విలువైన 23 యూనిట్లు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా రూ.12లక్షల 11వేలు విలువైన 248 యూనిట్లు పంపిణీ చేశారు. Sవ్యవసాయ శాఖ ద్వారా రూ.175 కోట్ల మేరకు రుణమాఫీ ప్రయోజనాల పత్రాలను లబ్ధిదార రైతులకు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప సతీమణి అనూరాధ, కలెక్టర్ అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సందడి