పండక్కి మరో పండగలా మా సినిమా ఉంటుంది | Mahesh Babu And Rashmika Mandanna New Movie Eith Anil Ravipudi | Sakshi
Sakshi News home page

పండక్కి మరో పండగలా మా సినిమా ఉంటుంది

Published Wed, Jan 1 2020 1:42 AM | Last Updated on Wed, Jan 1 2020 5:00 AM

Mahesh Babu And Rashmika Mandanna New Movie Eith Anil Ravipudi - Sakshi

మహేశ్‌ హోస్ట్‌ చేస్తున్న ఫంక్షన్‌కు మెగాస్టార్‌ చిరంజీవిగారు అతిథిగా వస్తున్నారు. అందుకే మా ప్రీ–రిలీజ్‌ వేడుకను ‘మెగాసూపర్‌ ఈవెంట్‌’ అంటున్నాం. ఇటీవల జరిగిన మహేశ్‌ ఫ్యాన్స్‌ ఫొటోషూట్‌ మొదటిరోజు మేం ఊహించినదానికంటే చాలా ఎక్కువమంది అభిమానులు వచ్చారు. దాంతో చిన్న తొక్కిసలాట చోటు చేసుకుంది. తర్వాతి రోజు కార్యక్రమం సజావుగా సాగింది. చిరంజీవి, మహేశ్‌గార్ల క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకునే మెగాసూపర్‌ ఈవెంట్‌కు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలీసుల సహకారం ఉంది.  

►మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. అనిల్‌ సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అనిల్‌ సుంకర చెప్పిన విశేషాలు. మహేశ్‌బాబుగారితో నేను అసోసియేట్‌ అయిన నాలుగో చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఆయనతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ బాగుంటుంది. 2019 జూలై 5న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించాం. దాదాపు 140 రోజులు షూటింగ్‌ చేశాం. కశీ్మర్‌ షెడ్యూల్‌ అద్భుతంగా ముగిసింది. మాకు మంచి సపోర్ట్‌ లభించింది. అందుకే అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయగలుగుతున్నాం. ఈ చిత్రంలోని ట్రైన్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుం ది. సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్‌ అందరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమాను నిరి్మంచినందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నా.
►ఇదివరకు సోల్జర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచి్చన సినిమాలకు ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు వెండితెరపై రాని, మనం ఊహించని కథ ఇది. కర్నూలు ‘కొండారెడ్డి బురుజు’ సెట్‌ సన్నివేశాలను కథలో భాగంగానే షూట్‌ చేశాం. ‘ఒక్కడు’ సినిమాతో ఈ సీన్స్‌కు ఏ పోలిక ఉండదు. మహేశ్‌బాబుగారి కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ హిట్స్‌గా ఈ సినిమా నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా మహేశ్‌ ఫ్యాన్స్‌కు పెద్ద పండగలా, ఈ సంక్రాంతి పండక్కి మరో పండగలా ఉంటుంది.  
►మహేశ్‌ యాక్టింగ్‌లో మరో యాంగిల్‌ చూస్తారు. మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. మహేశ్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్నాయి. ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు. దాదాపు 13ఏళ్ల తర్వాత విజయశాంతిగారు నటించారు. ఈ చిత్రంలో మహేశ్‌–విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. వీరిద్దరూ స్క్రీన్‌పై ఉన్నప్పుడు ప్రేక్షకులు ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. ఈ రెండూ చేయనప్పుడు కన్నీళ్లు పెడతారు.
►కథలో ఎంటర్‌టైన్‌మెంటే కాదు మంచి ఎమోషన్‌ కూడా ఉంది. అనిల్‌ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలే కాదు మరో రకమైన సినిమాలు కూడా తీయగలడని ఈ సినిమాతో నిరూపితమవుతుంది. అలా అని సినిమాలో వినోదం లేదని కాదు. అనిల్‌ డైరెక్షన్‌లో కొత్త కోణాన్ని చూస్తారు. దేవిశ్రీప్రసాద్‌ మంచి సంగీతం అందించారు. విజువల్స్‌ పరంగా పాటలకు ఇంకా మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాకు ‘దిల్‌’ రాజు సమర్పకులుగా ఉండటం ప్లస్‌ పాయింట్‌. డిస్ట్రిబ్యూషన్‌కు మరింత హెల్ప్‌ అవుతుంది. తొలుత ఈ సినిమాను జనవరి 12న రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సలహా మేరకు జనవరి 11న విడుదల చేస్తున్నాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement