
మహేశ్‌బాబు
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ కేరళకు వెళ్లనున్నారు. అక్కడ ఓ సీక్రెట్ మిషన్‌ను ప్లాన్ చేశారట. ఆ మిషన్ టార్గెట్ సంక్రాంతికి తెలుస్తుంది. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్ర చేస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటోంది. త్వరలో ఓ షెడ్యూల్‌ను కేరళలో ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. విజయశాంతి, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరకర్త. ‘దిల్’ రాజు, మహేశ్ బాబు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా జన వరి 12న విడుదల కానుంది.