మేజర్‌ అజయ్‌ కృష్ణ రిపోర్టింగ్‌.. | Mahesh Babu Birthday Special Sarileru Neekevvaru INTRO Released | Sakshi
Sakshi News home page

మేజర్‌ అజయ్‌ కృష్ణ రిపోర్టింగ్‌..

Aug 9 2019 9:44 AM | Updated on Aug 10 2019 4:36 PM

Mahesh Babu Birthday Special Sarileru Neekevvaru INTRO Released - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం అభిమానులను ఓ కానుకను అందజేసింది. ఈ చిత్రానికి సంబంధించి మహేష్‌ బాబు లుక్‌ను ది ఇంట్రో పేరుతో శుక్రవారం విడుదల చేశారు. మేజర్‌ అజయ్‌ కృష్ణ రిపోర్టింగ్‌ అంటూ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. ఆర్మీ మేజర్‌ లుక్‌లో మహేష్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు.. నువ్వేళ్లే రహదారికి జోహర్లు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు అంటూ సాగే బ్యాగ్రౌండ్‌ బిట్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది.

మరోవైపు మహేష్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా మహేష్‌కు విషెస్‌ అందజేశారు. హరీశ్‌ శంకర్‌, రామజోగయ్య శాస్త్రి, మెహర్‌ రమేశ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సుషాంత్‌, శ్రీను వైట్ల, దేవీ శ్రీ ప్రసాద్‌, కోన వెంకట్‌, సంపత్‌ నంది, సీనియర్‌ నరేశ్‌, ఈషా రెబ్బా, అనిల్‌ సుంకర, వెన్నెల కిశోర్‌, అనిల్‌ రావిపూడి సూపర్‌ స్టార్‌కు ట్విటర్‌ వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలిపారు. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement