గన్ ట్రిగ్గర్ లాగి లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్న మేజర్ అజయ్‌కృష్ణ ఆపరేషన్ ఎలా విజయవంతమైందన్న విజువల్ సంక్రాంతి పండక్కి వెండితెరపై చూడొచ్చు. ఆ లోపు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఈ ఆపరేషన్ తాలూకు శాంపిల్‌ను ఈ వారంలో టీజర్‌గా విడుదల కాబోతుంది. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఈ చిత్రంలో మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఈ సినిమా టీజర్‌ను అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా ఈ నెల 23న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తాజా సమాచారం. టీజర్‌ను ఈ నెల 19న విడుదల చేసి, ఈ నెల 23న మూవీ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. డిసెంబర్ మొదటివారంలో ఓ పాటను విడుదల చేస్తారట. ఈ విషయాలపై అతి త్వరలో అధికారిక ప్రకటన వెల్లడి కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment