Bhagavanth Kesari Teaser: Nandamuri Balakrishna's 108th film directed by Anil Ravipudi - Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: అదిరిపోయిన ‘భగవంత్‌ కేసరి’ టీజర్‌

Published Sat, Jun 10 2023 11:21 AM | Last Updated on Sat, Jun 10 2023 11:56 AM

Nandamuri Balakrishna And Anil Ravipudi Bhagavanth Kesari Teaser - Sakshi

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు జూన్‌ 10 పండుగరోజు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానుల కోసం ‘భగవంత్‌ కేసరి’ టీజర్‌ను వదిలారు. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి  దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. 

(ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్‌ వైరల్‌)

'అడవి బిడ్డా .. నేలకొండ భగవంత్ కేసరి' అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్‌లోకి దిగిపోవడం ఈ టీజర్‌లో కనిపిస్తుంది. 'ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది' అంటూ తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ బాలయ్య కేక పుట్టించాడు. గత సినిమాల్లోలాగే బాలయ్య రక్తపాతం సృష్టించేందుకు రెడీ అయ్యాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో తమన్ దుమ్ములేపాడు. పవర్‌ఫుల్‌ టీజర్‌తో సినిమా రేంజ్‌ను భారీగా పెంచేశాడు బాలకృష్ణ. ‘భగవంత్‌ కేసరి’ ఈ దసరాకు విడుదల చేస్తున్నట్లు టీజర్‌లో మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది.

(ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్‌ హీరోయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement