టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్‌లో బిజీ అయిపోయాడా? లైగర్ ఫ్లాప్ తర్వాత కాస్త విరామం తీసుకున్న యంగ్ హీరో మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన తదుపరి సినిమా జనగణమన షూటింగ్ కోసం సైనికులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గన్ పట్టుకుని ఉన్న ఓ ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. బాక్సాఫీస్ వద్ద లైగర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆపేసినట్లు చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా విజయ్ ఆర్మీ క్యాంపులో కనిపించడంతో ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫోటో-షేరింగ్ యాప్‌లో చిత్రాన్ని షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. 'దేశంలో అత్యంత పెద్ద దుర్ఘటన యూరీ' అని రాశాడు.
ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రకటన కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఛాపర్ నుండి బయటకు రావడం కనిపించింది. గతంలో ఈ చిత్రం ఆగిపోయిందన్న రూమర్లను నిర్మాత ఛార్మీ కౌర్ అవన్నీ ఫేక్ అంటూ ట్వీట్ చేసింది. వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్‌ల సహకారంతో ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ పాన్-ఇండియా చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 3 ఆగస్టు 2023న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment