charmee
-
లైగర్ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ
బాక్సాఫీస్ బద్ధలు కొడుతుందనుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ నిర్మించారు. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ గండం గట్టెక్కలేకపోయింది. ఈ సినిమా వల్ల ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరవధిక దీక్షకు పూనుకున్నారు. నష్టాన్ని భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ధర్నాపై నటి, నిర్మాత చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపింది. చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై... ఆ ఓటీటీలో అప్పుడే స్ట్రీమింగ్! -
ఆర్మీ క్యాంపులో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయాడా? లైగర్ ఫ్లాప్ తర్వాత కాస్త విరామం తీసుకున్న యంగ్ హీరో మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన తదుపరి సినిమా జనగణమన షూటింగ్ కోసం సైనికులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గన్ పట్టుకుని ఉన్న ఓ ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. బాక్సాఫీస్ వద్ద లైగర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆపేసినట్లు చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా విజయ్ ఆర్మీ క్యాంపులో కనిపించడంతో ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫోటో-షేరింగ్ యాప్‌లో చిత్రాన్ని షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. 'దేశంలో అత్యంత పెద్ద దుర్ఘటన యూరీ' అని రాశాడు. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రకటన కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఛాపర్ నుండి బయటకు రావడం కనిపించింది. గతంలో ఈ చిత్రం ఆగిపోయిందన్న రూమర్లను నిర్మాత ఛార్మీ కౌర్ అవన్నీ ఫేక్ అంటూ ట్వీట్ చేసింది. వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్‌ల సహకారంతో ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ పాన్-ఇండియా చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 3 ఆగస్టు 2023న విడుదల కానుంది. -
‘ఇస్మార్ట్ శంకర్’ మొదలైంది..!
కొద్ది రోజులుగా దర్శకుడిగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న పూరి జగన్నాథ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన స్టైల్‌కు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను ప్రారంభించారు. డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి కంబ్యాక్ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమా ఈ రోజు (బుధవారం) పూరి జగన్నాథ్ ఆఫీస్‌లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్, హీరో రామ్‌తో పాటు సహ నిర్మాత చార్మి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్రవంతి రవికిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మెహబూబా’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా మెహబూబా. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన తన తనయుడు ఆకాష్‌ను ఈసినిమాతో రీలాంచ్ చేస్తున్నాడు పూరి. భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్, ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరోయిన్ ఛార్మీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ‘విజయవంతంగా మెహబూబా షూటింగ్ మొత్తం పూర్తి చేశాము. ఆనందంగా, సంతృప్తిగా ఇంటికి తిరిగి వెలుతున్నాం. ఈ పోరాటంలో మాతో కలిసి ప్రయాణించిన అందరికీ కృతజ్ఞతలు’ అంటూ యూనిట్ సభ్యులతో దిగిన ఫోటోలను ట్వీట్ చేసింది ఛార్మీ. Successfully completed the total shoot of #Mehbooba.. feeling light n going back home happy n satisfied.. thanks to each n everyone who fought this journey along with us 🙏🏻🤗 #PCfilm @PuriConnects @PuriConnects @ActorAkashPuri @Neha__Shetty @ActorVishuReddy @TheFilmMehbooba pic.twitter.com/oSk6NMJxaI — CHARMME KAUR (@Charmmeofficial) 23 February 2018 -
వీకెండ్ పార్టీలో వర్మ, పూరి
-
వీకెండ్ పార్టీలో వర్మ, పూరి
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హాట్ బ్యూటీ చార్మీలు ఒకే చోట చేరారు. అదేదో సినిమా డిస్కషన్స్ కోసం కాదండి. ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేసేందుకు అంతా ఒక చోటి చేరి సందడి చేశారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓ సినిమా చేస్తున్న హైదరాబాద్ లో ఉన్నారు. పూరి కూడా తన కొడుకును హీరోగా రీ లాంచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న మెహబూబా సినిమాకు సంబంధించిన హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ ఇద్దరు సరదాగా వీకెండ్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియోలను హీరోయిన్ చార్మీ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. వర్మ, పూరి, ఆకాష్, చార్మీలతో పాటు మరికొంత మంది ఈ వీడియోలో కనిపించారు. ఒక వ్యక్తి వయోలిన్ ప్లే చేస్తుండగా వర్మ, పూరి లు ఆ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అంతేకాదు వర్మ ఏకంగా ఆ అతని కాళ్లు తాకి మరి మ్యూజిక్ సూపర్ అంటూ పొగిడేశాడు. #satnite #fun 🎉💃 pic.twitter.com/Ka0i4eLbtM — CHARMME KAUR (@Charmmeofficial) 25 November 2017 -
అందంతో పాటు మంచి మనసున్న నటి
హైదరాబాద్: అందమైన హీరోయిన్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి అని టాలీవుడ్ ముద్దుగుమ్మ ఛార్మి నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆమె షార్ట్ హెయిర్ తో వెరీ క్యూట్ గా కనిపిస్తున్నారు. దీనివెనక ఓ మంచిపని దాగుంది. సాధారణంగా ఆడవాళ్లు తమ కేశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే! అయితే క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితులకు సహాయం చేయాలని ఛార్మింగ్ హీరోయిన్ ఛార్మి భావించారు. క్యాన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసే సంస్థకు తన కేశాలు అందించారు. బేబీ కటింగ్ చేయించుకుని ఆ కత్తెర పడ్డ వెంట్రుకలను కొందరు మహిళలకు తయారుచేసే విగ్గుల కోసం వినియోగించనున్నారు. క్యాన్సర్ బారిన పడ్డ వారికి చేసే కీమోథెరపి చికిత్సలో భాగంగా వారు తమ కేశాలను కోల్పోయి ఎంతో ఆందోళన చెందుతుంటారు. వారికి తనవంతు సహాయంగా కొంత మేరకు జుట్టును ఛార్మి అందించారు. ఈ విషయం తెలిసిన చాలా మంది అభిమానులు ఛార్మి అందంతోనే కాదు మంచి మనసుతోనూ ఆకట్టుకుంటుందని అభినందిస్తున్నారు. కాగా, గతంలో నటి రేణు దేశాయ్ ఇదే తరహాలో క్యాన్సర్ బాధిత మహిళల కోసం తన కేశాలను అందించి సహాయం చేసిన విషయం తెలిసిందే. ఇలాగే మరి కొంతమంది హీరోయిన్లు ముందుకొస్తే ఎంతో కొంత మార్పు అనేది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. -
పూరి సమర్పణలో రేవతి దర్శకత్వం!
టాలీవుడ్లో మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది. ఒకప్పటి హీరోయిన్ రేవతి త్వరలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించనుంది. పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన రేవతి తెలుగులో కమర్షియల్ సినిమా చేయనుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ప్రస్తుతం రేవతి పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సమయంలోనే తన స్టోరి ఐడియా వినిపించిన పూరి రేవతిని ఆ సినిమాను డైరెక్ట్ చేయాల్సిందిగా కోరాడట, అందుకు రేవతి కూడా అంగీకరించటంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కా ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ చార్మీ సహనిర్మాతగా వ్యవహరించనుంది. గతంలో 'జ్యోతిలక్ష్మీ' సినిమాతో నిర్మాతగా మారిన ఈ బ్యూటి, మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మామ' లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో కనిపిస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేవతి దర్శకురాలిగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్!
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్స్ ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మేకప్ లేకుండా ఇలియానాను అసలు చూడలేమంటూ ఛార్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకి అసలు విషయం ఏమిటంటే... ఓ ప్రయివేట్ ఛానల్ కార్యక్రమంలో ఛార్మి పాల్గొంది. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె టకటకా సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా ఎక్కడికెళ్లినా మేకప్ కిట్ వెంట తీసుకు వెళ్లాల్సిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు ఛార్మి తడుముకోకుండా ఇలియానా పేరు చెప్పేసింది. మీరెప్పుడైనా ఇలియానాని మేకప్ లేకుండా చూశారా.. చూస్తే కనుక మేకప్ కిట్ దగ్గరే ఉంచుకోమని చెబుతారంటూ సెటైర్ వేసింది. వీరిద్దరూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'రాఖీ' చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇద్దరు హీరోయిన్లకు....ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సరైన అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. ఇలియానా బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంటే...ఛార్మి .. టాలీవుడ్లో అడపాదడపా వచ్చే అవకాశాలతో సరిపెట్టుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పోటీ లేకుండా ఛార్మి ఒక్కసారిగా...ఇలియానాను అలా ఎలా అనేసిందబ్బా!