
కొద్ది రోజులుగా దర్శకుడిగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న పూరి జగన్నాథ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను ప్రారంభించారు. డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి కంబ్యాక్ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
ఈ సినిమా ఈ రోజు (బుధవారం) పూరి జగన్నాథ్ ఆఫీస్‌లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్, హీరో రామ్‌తో పాటు సహ నిర్మాత చార్మి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్రవంతి రవికిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.