
బాక్సాఫీస్ బద్ధలు కొడుతుందనుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ నిర్మించారు. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ గండం గట్టెక్కలేకపోయింది.
ఈ సినిమా వల్ల ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరవధిక దీక్షకు పూనుకున్నారు. నష్టాన్ని భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఈ ధర్నాపై నటి, నిర్మాత చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపింది.
చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై... ఆ ఓటీటీలో అప్పుడే స్ట్రీమింగ్!
Comments
Please login to add a commentAdd a comment