ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్! | cold war between charmee and Ileana | Sakshi
Sakshi News home page

ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్!

Published Mon, Dec 29 2014 1:06 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్! - Sakshi

ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్!

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్స్ ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మేకప్ లేకుండా ఇలియానాను అసలు చూడలేమంటూ  ఛార్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు  టాలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకి అసలు విషయం ఏమిటంటే... ఓ ప్రయివేట్ ఛానల్ కార్యక్రమంలో ఛార్మి పాల్గొంది. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె టకటకా సమాధానం చెప్పాలి.

ఈ సందర్భంగా ఎక్కడికెళ్లినా మేకప్ కిట్ వెంట తీసుకు వెళ్లాల్సిన హీరోయిన్  ఎవరు అనే ప్రశ్నకు ఛార్మి తడుముకోకుండా ఇలియానా పేరు చెప్పేసింది. మీరెప్పుడైనా ఇలియానాని మేకప్ లేకుండా చూశారా.. చూస్తే కనుక మేకప్ కిట్ దగ్గరే ఉంచుకోమని చెబుతారంటూ సెటైర్ వేసింది. వీరిద్దరూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'రాఖీ' చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.  

అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇద్దరు హీరోయిన్లకు....ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సరైన అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. ఇలియానా బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంటే...ఛార్మి .. టాలీవుడ్లో అడపాదడపా వచ్చే అవకాశాలతో సరిపెట్టుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పోటీ లేకుండా ఛార్మి ఒక్కసారిగా...ఇలియానాను అలా ఎలా అనేసిందబ్బా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement