వీకెండ్ పార్టీలో వర్మ, పూరి | Ram Gopal Varma, Puri Jagannath weekend party | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 26 2017 9:01 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

Ram Gopal Varma, Puri Jagannath weekend party - Sakshi - Sakshi - Sakshi

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హాట్ బ్యూటీ చార్మీలు ఒకే చోట చేరారు. అదేదో సినిమా డిస్కషన్స్ కోసం కాదండి. ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేసేందుకు అంతా ఒక చోటి చేరి సందడి చేశారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓ సినిమా చేస్తున్న హైదరాబాద్ లో ఉన్నారు. పూరి కూడా తన కొడుకును హీరోగా రీ లాంచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న మెహబూబా సినిమాకు సంబంధించిన హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు.

ఈ ఇద్దరు సరదాగా వీకెండ్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియోలను హీరోయిన్ చార్మీ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. వర్మ, పూరి, ఆకాష్, చార్మీలతో పాటు మరికొంత మంది ఈ వీడియోలో కనిపించారు. ఒక వ్యక్తి వయోలిన్ ప్లే చేస్తుండగా వర్మ, పూరి లు ఆ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అంతేకాదు వర్మ ఏకంగా ఆ అతని కాళ్లు తాకి మరి మ్యూజిక్ సూపర్ అంటూ పొగిడేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement