
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్(Bigg Boss)కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు కింగ్ నాగార్జుననే బిగ్‌బాస్ సోకి వ్యాఖ్యాతగా ఉన్నారు. తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆటలో తప్పొప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసే విశ్లేషణ బిగ్‌బాస్ షోకి మరింత ప్లస్ అయింది. వారం మొత్తం చూడకపోయినా సరే.. శని,ఆదివారాలు షో చూసేవారు చాలా మందే ఉన్నారు. అందుకే ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం లేదట. ఆయన ప్లేస్‌లో ఓ యంగ్ హీరో రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కొత్తదనం కోసం కొత్త హోస్ట్!
బిగ్‌బాస్ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేడు. షో రొటీన్‌గా సాగడం, పెద్ద సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొనకపోవడంతో ఎనిమిదో సీజన్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తొమ్మిదో సీజన్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. కొత్తదనం కోసం హోస్ట్‌ని కూడా మార్చబోతున్నారట మేకర్స్. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్ హీరోని రంగంలోకి దించబోతున్నారట. గేమ్‌లోనూ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక హోస్ట్‌గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ విజయ్‌ని సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్‌పీరియన్స్ కోసం విజయ్ కూడా హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్ చెబితే తప్ప తెలియదు.
కంటెస్టెంట్స్ ఎంపికలో కొత్తట్రెండ్
బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు మేకర్స్. ఈ సారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్‌లోకి పంపిస్తారట. గత సీజన్లలో ఒక కామన్ మ్యాన్ కచ్చితంగా హోస్‌లోకి వెళ్లేవాడు. కానీ ఆ సారి ఆ రూల్‌కి బ్రేక్ వేశారట. ఈ సారి సెలెబ్రీలను మాత్రమే తీసుకోబోతున్నారట. అంతేకాదు గేమ్‌లోనూ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ యంగ్ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నాడట. అలాగే ఓ కమెడిన్, ప్రముఖ సింగర్, కొరియోగ్రాఫర్ కూడా ఈ సారి హౌస్‌లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత సీజన్లలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా.. చాలా పకడ్భందీగా తొమ్మిదో సీజన్‌ని ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment