
బిగ్‌బాస్ హౌస్‌లో మిగిలిన ఆరుగురిలోంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శ్రీముఖిలు టికెట్ టు ఫినాలే దక్కించుకుని టాప్ 5లో నిలిచారు. మిగతా ముగ్గురిలో ఫైనల్‌కు చేరే ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఇక వీకెండ్‌లో దీపావళి రావటంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓ అతిథిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమోను చూసినట్టయితే.. విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ హౌస్‌లోని కన్ఫెషన్ రూమ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూంలోకి పంపించగా రౌడీ స్టార్‌ను చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. జ్యోతక్క ఓ అడుగు ముందుకేసి లడ్డుగైనవ్.. అంటూ అతన్ని ఆటపట్టించింది.
వైఫ్ లేకుండా ఎలా ఉంటున్నావ్ అని విజయ్.. వరుణ్‌ను ఆటపట్టించాడు. అంతేకాకుండా అతడి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ఈ టాలీవుడ్ రౌడీ. ఈ సమయంలో నాగ్.. విజయ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘నీ పెళ్లి గురించి ఎప్పుడూ రూమర్స్ వస్తూనే ఉంటాయి. మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్’ అని అడిగాడు. దీనికి రౌడీ స్పందిస్తూ ‘ఇంకా తన అమల దొరకలేదు’ అని నాగ్‌కు ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. దీనికి నాగ్ బదులిస్తూ ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’నని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్ సరదాగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. రౌడీ సందడిని చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment