
మెహరీన్, రవితేజ, శిరీష్, అనిల్ రావిపూడి, సాయి కార్తీక్
‘‘ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్. ‘రాజా ది గ్రేట్’ సినిమాలో బాగా చేశారంటూ నాకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చూస్తుంటే హ్యాపీగా ఉంది. కొంచెం గ్యాప్ వచ్చినా రిజల్ట్ చూస్తే.. సో హ్యాపీ. నేను కావాలని గ్యాప్ తీసుకోలేదు... వచ్చిందంతే’’ అని రవితేజ అన్నారు. రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘రాజా ది గ్రేట్’ ఇటీవల విడుదలైంది. ఆదివారం సక్సెస్‌మీట్ నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘నన్ను అనిల్ నమ్మాడు. అనిల్‌ని నేను నమ్మాను. అందుకే ఇంత మంచి ప్రాజెక్ట్ వచ్చింది. మెహరీన్‌ది గోల్డెన్‌లెగ్. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టింది. శిరీష్ చాలా హానెస్ట్‌గా ఉంటాడు. తనలో నాకు నచ్చేది అదే. అనిల్ నువ్వు నీలాగే ఉండు. నిన్ను చెడగొట్టడానికి రకరకాలుగా ట్రై చేస్తుంటారు. అనిల్‌కి మంచి క్లారిటీ, కన్వెన్షన్‌తో పాటు పాజిటివ్ నేచర్ ఉంది. మా వాడి (కొడుకు మహాధన్) నటనకు కూడా మంచి మెసేజ్‌లు వస్తుంటే వాడు పొంగిపోతున్నాడు. నా దగ్గరే చిన్నగా ఫోజు కొట్టడం మొదలెట్టాడు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘నాలుగు రోజులుగా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నాం.
అందరూ ఒక్కటే మాట అంటున్నారు. సినిమా సినిమాకి నవ్వులెక్కువవుతున్నాయని. ఇప్పుడు భయం వేస్తోంది. వచ్చే సినిమాలో ఇంకెన్ని నవ్వులు పంచాలా అని. నా గత సినిమాలకీ, ఈ సినిమాకి తేడా ఏంటంటే.. ఈ చిత్రానికి సక్సెస్‌తో పాటు ప్రశంసలు రావడం గొప్పగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎంyì ంగ్ వరకూ ఓ అంధుడి క్యారెక్టర్‌తో ప్రేక్షకులను కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. ఏదైనా సినిమాలో ఒక సీన్ హైలైట్ అవుతుంది. ఈ సినిమాలో ఇన్ని సీన్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం ఒక రచయితగా, దర్శకునిగా నా లైఫ్‌లో నేను మరచిపోలేను. సక్సెస్ చేసిన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా. అంధ విద్యార్థుల కోసం ఒక షో వేయబోతున్నాం. సాయికార్తీక్ అనగానే అతని ట్యూన్స్ పెద్దగా బాగుండవు కదా అన్నారు. నాకు తెలిసి ఈ జనరేషన్లో వన్నాఫ్ ది బెస్ట్ నేపథ్య సంగీత దర్శకుడతను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్యూ వెరీ మచ్’’ అన్నారు శిరీష్. ‘‘ఇక డబుల్ హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు మెహరీన్. సంగీత దర్శకుడు సాయికార్తీక్, కెమెరామేన్ మోహనకృష్ణ, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, రవిప్రకాశ్, ‘చిత్రం’ శ్రీను, ఎడిటర్ తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment